పోసాని కృష్ణమురళి.. ఈ పేరుకు కొత్తగా  పరిచయం అవసరం లేదు.  దివంగత నేత వైఎస్ అయినా ఇపుడు జగన్మోహన్ రెడ్డికైనా పోసాని ఏ స్ధాయి మద్దతుదారుడో అందరికీ తెలిసిందే. అలాంటి పోసానే రాజధాని అమరావతి ఆందోళనల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై మరో మద్దతుదారుడు పృధ్విపై విరుచుకుపడ్డారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఆమధ్య అమరావతి ఆందోళనలపై పృధ్వి మాట్లాడుతూ పెయిడ్ ఆందోళనలని, పెయిడ్ ఆర్టిస్టులంటూ ఆరోపించారు. పైగా రైతులైతే గోచీలు పెట్టుకోవాలి గానీ ప్యాంట్లు వేసుకోవటం ఏమిటి ? చేతులకు బంగారు గాజులు, ఖరీదైన వాచీలు, సెల్ ఫోన్లు పెట్టుకున్న విషయంపైన కూడా కామెంట్లు చేశారు. దానిపై తాజాగా పోసాని పృధ్విపై నిప్పులు చెరిగారు.

 

రైతులైతే గోచీలే పెట్టుకోవాలా ? ఖరీదైన వాచీలు, బంగారు గాజులు కొనుక్కోకూడదా ? అంటూ వాయించేశారు. వాళ్ళ పిల్లలంతా బాగా చదువుకుని విదేశాల్లో ఉన్నపుడు ఖరీదైన వస్తువులు వాడకూడదా ? అంటూ నిలదీశారు ?  రైతులను కించపరుస్తు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోసాని టార్గెట్ చేసింది పృధ్వీనే కానీ వేసిన బాణాలు మంత్రులు, కొందరు ఎంఎల్ఏలకు కూడా తగిలినట్లే. పోసాని మాట్లాడుతూ పృధ్వీ లాంటి వాళ్ళే ప్రభుత్వానికి జగన్ కు చెడ్డపేరు వస్తోందంటే మండిపడ్డారు. పైగా పృధ్వీ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా లేకపోతే ప్రభుత్వం తరపున మాట్లాడారా ? చెప్పాలంటూ నిలదీశారు.

 

పృధ్వి లాగ మాట్లాడుతున్న వాళ్ళు ఇంకా పార్టీలో చాలా మందే ఉన్నారు. రాజధాని తరలింపుపై మాత్రం పోసాని ఏమీ మాట్లాడలేదు. రైతులను కించపరుస్తు పృధ్వి కానీ లేకపోతే వైసిపి నేతలు చేస్తున్న కామెంట్ల పై  మాత్రమే ఫైర్ అయ్యారు.  ఒకవైపు పృధ్విని అడ్డం పెట్టుకుని నేతలందరినీ పోసాని వాయించేసినట్లే. బహుశా పోసాని నుండి ఇటువంటి రియాక్షన్ జగన్ ఊహించలేదా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: