ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం , ఫేజ్ -2 వీడ్కోలు కార్యక్రమం యూసఫ్ గూడాలో లోని మైక్రో, స్మాల్  అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ (నిమ్స్ మే)లో ఘనంగా జరిగింది. 32 దేశాల నుండి 64 మంది పార్టిసిపెంట్స్ నిమ్స్ మే లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. విదేశీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఇండియన్ టెక్నీకల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (ఐటీసీ ) పేరుతొ గత 64 సంవత్సరాలుగా విదేశీ ఔత్సాహికులకు ప్రపంచవ్యాప్తంగా ఎదురరవుతున్న సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలోని వివిధ శిక్షణా సంస్థల సహకారంతో కోర్సులను అందిస్తోంది. ఇందులో భాగంగా దాదాపుఆరు దశాబ్దాలుగా నిమ్స్ మే విదేశీ విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన వివిధ కోర్సులను అందిస్తోంది. 
6 వారాల పాటు విదేశీ విద్యార్థులు టూరిజం హాస్పటాలిటీ ఆండ్ మేనేజ్మెంట్ మరియు ఎస్ఎంఈ ఫైనాన్సింగ్ - ఆప్రోచస్ ఆండ్ స్ట్రాటజీస్  కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్ హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిమ్స్ మే సంస్థ డైరక్టర్ జనరల్ డి.చంద్రశేఖర్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు . ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అదే విధంగా దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో ఎంఎస్ఎంఈ ల ప్రాధాన్యతను వివరించారు. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ క్రింద ఎంఎస్ఎంఈ రంగాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడానికి నిమ్స్ మే సంస్థ ఎప్పటికప్పుడు తన పనితీరును మెరుగుపరుచుకుంటూ ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి కోసం 1967 నుండి ఈ క్రమంలో సాగించిన ప్రస్థానాన్ని కార్యక్రమంలో పాల్గొన్నవారికి  వివరించడం జరిగింది. నిమ్స్ మే సంస్థ కేవలం శిక్షణా పరంగానే కాకుండా  ఎంఎస్ఎంఈ రంగంలో రీసెర్చ్ డెవలప్ మెంట్, మార్కెటింగ్ రంగాల్లో సైతం తన సేవలను విస్తృత పరుచుకొంటుంది అని తెలియజేశారు.  ఎంఎస్ఎంఈ రంగంలో దేశంలోని వివిధ సంస్థలతో కలుపుకొని నిమ్స్ సమన్వయంతో ముందుకు వెళుతుందని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ ఐటీఈసీ కార్యక్రమం క్రింద చేపడుతున్న కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. 


ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో, సుహృద్భావ వాతావరణ లక్ష్యంతో ఐటీఈసీ కార్యక్రమం క్రింద ఇలాంటి కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వివిధ దేశాలు ఎదురుకుంటున్న సమస్యలకు కలసికట్టుగా ముందుకు వెళ్లాడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి అని తెలిపారు. నిమ్స్ మే సంస్థ ఐటీఈసీ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి తమతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో తమ యొక్క లక్ష్యాలు నెరవేరే క్రమంలో నిమ్స్ మే అందిస్తున్న సహకారం ప్రశంసనీయం అని తెలిపారు. అంతర్జాతీయ శిక్షణలో భాగంగా పాల్గొన్న వారి అభిప్రాయాలను గమనిస్తే కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో అర్థమవుతుంది అన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా సాధించుకున్న విజ్ఞానాన్ని తమ తమ దేశాల్లో అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు శిక్షణ పూర్తి చేసుకున్న వారు శిక్షణకు సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు. ఎంతో దూరం నుండి ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన తమకు నిమ్స్ మే అందించిన సహకారం అద్భుతమని తెలిపారు. ఇక్కడి వాతావరణం, సంస్థ సిబ్బంది, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలు మరువలేమని తెలిపారు. శిక్షణలో భాగంగా మైసూర్, బెంగుళూర్ నగరాలకు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లి దాని ద్వారా సాధించుకున్న పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఇక్కడ ఆహారపు అలవాట్లు తమను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.

పారిశ్రామికంగా ఎదురవుతున్న అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి నిమ్స్ మే లాంటి సంస్థల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. తమ లక్ష్యం నెరవేరడానికి, శిక్షణ విజయవంతం కావడానికి సహకరించిన డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ సహకారం మరువలేమన్నాయారు. మహాత్మాగాంధీ చెప్పిన విధంగా సమాజంలో మార్పు మన నుండే ప్రారంభంకావాలన్నారు. ఈ శిక్షణ అందించిన నిమ్స్ మే సంస్థకు, ఇంతటి గొప్ప కార్యక్రమం రూపొందించిన భారత ప్రభుత్వ విదేశాంగ సంస్థకు, ఇక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన వారితో పాటు ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు డాక్టర్ దిబెందు చౌదరీ, డాక్టర్ విజయ, డాక్టర్ కె. విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ శర్మ, సందీప్ భట్నాగర్ మరియు ఇతర ఫ్యాకల్టీ బృందం పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: