ఇంత వరకూ చంద్రబాబునాయుడు ఎవ్వరికీ భయపడలేదట. నవ్వకండి ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ  తాను ఇంత వరకూ ఎవరికీ భయపడలేదని గంభీరంగా చెప్పుకున్నారు. విన్నవాళ్ళందరూ  పెద్ద జోక్ విన్నంతగా నవ్వుకునే  ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు ధైర్యం గురించి, పిరికితనం గురించి తెలీని వాళ్ళు దాదాపు ఉండరనే చెప్పాలి.

 

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పరిపాలనను హైదరాబాద్ నుండే ప్రారంభించారు. పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ఎనిమిది మాసాలకే అర్ధాంతరంగా ఎందుకు విజయవాడకు పారిపోయారు ? ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత తెలంగాణా పోలీసులు ఎక్కడ తనను అరెస్టు చేస్తారో అన్న భయంతోనే  హైదరాబాద్ ను రాత్రికి రాత్రి వదిలి పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

 

 ఇక కాస్త వెనక్కు వెళితే వైఎస్సార్ ఉన్నంత కాలం నేరుగా మాట్లాడటానికే అసెంబ్లీలో భయపడిన విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పార్టీ పగ్గాలను లాక్కున్న తర్వాత ఒక్కసారి కూడా ఏ ఎన్నికలో కూడా ఒంటరిగా పోటి చేసిన పాపాన పోలేదు. ఎందుకు చేయలేదంటే ఓటమి భయంతోనే అందరికీ తెలుసు. మొన్న అంటే 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటి చేశారు.

 

ఎందుకంటే పొత్తులు పెట్టుకోవటానికి ఏ పార్టీ మిగలలేదు కాబట్టి. ఒంటరిగా పోటి చేస్తే ఏమైందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక అధికారంలో ఉన్నపుడు కూడా జగన్మోహన్ రెడ్డిపై నేరుగా పోరాటం చేయలేకే  జనసేన అధినేత పవన్ ను అద్దెకు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఎప్పటి విషయాలో అవసరం లేదనుకుంటే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ నరేంద్రమోడికి వ్యతిరేకంగా ఎందుకు నోరు కూడా లేవటం లేదు ? ఎన్నికల సమయంలో మోడికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడారో అందరూ చూసిందే.   దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి మరీ మోడి గురించి వ్యతిరేక ప్రచారం కూడా చేశారు.  ఎన్నికల్లో తలబొప్పి కట్టిన తర్వాత  మళ్ళీ మోడికి వ్యతిరేకంగా నోరెత్తితే ఒట్టు. మోడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో నోరు కూడా ఎత్తటం లేదు. మరి దీన్ని కూడా ధైర్యమనే అంటారా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: