రాజధాని అమరావతిని తరలించకూడదని నానా యాగీ చేస్తున్న చంద్రబాబునాయుడు ఇదే డిమాండ్ ను కర్నూలు, విశాఖపట్నం వెళ్ళి వినిపించేంత ధైర్యం చేయగలరా ?  రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే.  అమరావతిలోనే  అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన విశాఖపట్నంలో ఉండాలని హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాలని జగన్ సూచించారు.

 

జగన్ నోటివెంట సూచనగానే వచ్చినా దాదాపు ఇదే ఖాయమని అర్ధమైపోతోంది. కాకపోతే జగన్ నుండి అధికారిక ప్రకటన రావటమే మిగిలుంది.   జగన్ ప్రతిపాదన చేసిన దగ్గర నుండి చంద్రబాబు వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. దగ్గరుండి జనాలను రెచ్చగొట్టి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా ఊరూరా తిరుగుతున్నారు. విజయవాడలో, మచిలీపట్నం, అమరావతి ప్రాంతాల్లో తిరుగుతూ రాజధానిని తరలించేందుకు లేదంటూ జగన్ పై మండిపడుతున్నారు.

 

ఇంతవరకూ బాగానే ఉంది.  మరి ఇదే డిమాండ్ ను జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో  చేయగలరా ? కర్నూలులో హై కోర్టు వద్దని అక్కడికి వెళ్ళి జనాలకు చెప్పగలరా ?  రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయకూడదని అమరావతినే కంటిన్యు చేయాలని ఉత్తరాంధ్రకు వెళ్ళి తన డిమాండ్ ను వినిపించగలరా ?

 

ఎంతసేపు అమరావతి,  గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే  ఉంటూ జగన్ కు వ్యతిరేకంగా జనాలను రెచ్చ గొట్టటమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు రాష్ట్రప్రజలు ఎవరూ ఒప్పుకోవటం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి అదే నిజమైతే మిగిలిన జిల్లాలకు వెళ్ళి తన వాదనకు అనుకూలంగా, డిమాండ్ కు మద్దతుగా జనాలను ఎందుకు కూడగట్టటం లేదు ?

 

చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే ఎల్లోమీడియా  రెచ్చిపోవటం చూస్తుంటే నిజంగానే వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే జనాలను రెచ్చ గొడుతున్న విషయం అర్ధమైపోతంది. అందుకనే  మిగిలిన జిల్లాల్లో చంద్రబాబు డిమాండ్ కు కనీసం టిడిపి నేతల నుండి కూడా మద్దతు లభించటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: