సమాజంలోని ప్రతి మనిషిలో దాదాపుగా ఉండే ఒక చిన్న వ్యాధి లాంటి అలవాటు నిర్లక్ష్యం. ఇది వినడానికి చాల చిన్నదిగానే అనిపిస్తుంది.పలకడానికి, చెప్పడానికి కూడా సులువుగానే ఉంటుంది. కానీ దీని పర్యావసనం ఒక నిండు జీవితం. ఎన్ని కోట్లు పెట్టిన దక్కని బంధం, ఆనందం.. ఇవన్ని కూడా చిన్న నిర్లక్ష్యం వల్ల నష్టపోవలసి వస్తుంది.

 

 

ఇంకా చెప్పాలంటే బలవంతంగా వదులుకోవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు గాని, తోడపుట్టిన వారు కాని, ప్రాణ స్నేహితులు గాని, ఇతరుల నిర్లక్ష్యానికి బలి అయ్యి ఒకవేళ మరణిస్తే ఆ బాధను ఎవరు తీరుస్తారు. ఎవరు మరిపిస్తారు. వారితో పొందిన ప్రతి ఆనంద క్షణాలను తిరిగి ఎవరు తీసు కొస్తారు. ఇలా ఇప్పటికే ఎన్నో ప్రాణాలు ఆరిపోతున్నాయి. ఎందరో తమ అనుకున్న వారిని పోగొట్తుకుని అనాధలా బ్రతుకుతున్న వారు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. మరి ఇలాంటి నిర్లక్ష్యాన్ని చిన్నదని అనుకోవడానికి వీలులేదు.

 

 

ఇకపోతే ఈ నిర్లక్ష్యం వల్ల మనకు నష్టం జరగకున్న ఒక్కోసారి పక్కన ఉన్నవారిని, మన వెంట ఉన్న వారిని ప్రమాదంలో పడేస్తుంది. అందుకు నిదర్శనమే మనం ఇప్పుడు చూడబోయే సంఘటన.. అదేమంటే ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి కారులో వెళ్తుండగా వెనకాల సీట్లో  కూర్చున్న అతని కొడుకు మూల మలుపు వద్ద కారు వెనక డోర్ తెరుచుకుని క్రింద పడిపోయాడు.. దీనికంతటికి కారణం అతను నిర్లక్ష్యంగా ఉండటం. ఆ నిర్లక్ష్య ధోరణితో కార్ వెనక డోర్ సరిగా లాక్ చేయకపోవడం.

 

 

అందువల్ల మలుపువద్ద కారు డోర్ తెరుచుకుని అందులో ఉన్న బాలుడు క్రిందపడి పోయాడు.. ఆ సమయంలో కారు వెనకలే మరో ట్రాలీ వాహనం వేగంగా వస్తుంది. కానీ అందులోని డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల  ఆ బాబు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఇలా ఆ బాలుడి ప్రాణాలు దక్కాయి. వెంటనే బాలుడి తండ్రి కారు దిగివచ్చి రోడ్డుపై పడిన తన కొడుకును చేతిలోకి తీసుకున్నాడు. ఇంకా ఆ బాబు ఆయుషు గట్టిది కాబట్టి చిన్న గాయాలతో బతికి బయటపడ్డాడు. అదే జరగరానిది జరిగితే ఊహించడం కష్టం..

 

 

ఇకపోతే ఇంతలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ, డ్రైవింగ్ చేసిన ఆ వ్యక్తిని నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు. ఇక ఈ ఘటన పట్ల స్పందించిన పోలీసులు ఎవరైనా కారులో వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కనీసం ఈ వీడియో చూసి అయినా మారాలంటూ పేర్కొంటున్నారు. ఇకపోతే కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పంకజ్ జైన్ అనే ఐపీఎస్ అధికారి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: