తమిళనాడు అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టింది.  ఇంతకీ విషయం ఏమిటంటే సకాలంలో మంచినీటిని తమిళనాడుకు సరఫరా చేసినందుకు ఏకగ్రీవంగా తమిళనాడు నిండు అసెంబ్లీ జై కొడుతూ తీర్మానం చేసింది.  మంచినీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్న తమిళనాడు ప్రధానంగా చెన్నై మహానగారిని అడిగిన వెంటనే ఏపి నుండి నీటిని సరఫరా చేసి ఆదుకున్నందుకు అధికార ఏఐఏడిఎంకె పార్టీ ప్రవేశపెట్టిన అభినందన తీర్మానానికి మిగిలిన ప్రతిపక్షాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మద్దతు పలకటం గమనార్హం.

 

చెన్నై మహానగరాన్ని మంచినీటి కొరత పట్టుకుని పీడించటం ఇప్పటిది కాదు. ద:శాబ్దాలుగా మంచినీటి సమస్య పట్టి పీడిస్తునే ఉంది.   ఈ సమస్యను అధిగమించటానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలించటం లేదు. నగరం పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను ఆక్రమించి భారీ భవనాలు కట్టేయటమే అసలైన సమస్య. దీనికి ఈ పార్టీపార్టీ అని మినహాయింపు లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు చెరువులు, కుంటలను, కాల్వలను ఆక్రమించేసి భవనాలు కట్టేయటం మామూలే.

 

మామూలుగా చెన్నై నీటి దాహార్తిని చెంబరబాక్కం, పూండి, పుళల్, చోళవరం, రెడ్ హిల్స్ జలాశయాలు తీరుస్తుంటాయి. అయితే వర్షాలుపడని కారణంగా, భూగర్భజలాలు నిండుకోవటంతో మంచినీటి సమస్య పెరిగిపోయింది. దాంతో ఎక్కడో ఉన్న జోలారుపేట నుండి రైలు ట్యాంకర్లతో నీటిని తీసుకొస్తున్నా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు.  దాంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. మంచినీటి సరఫరాకు రిక్వెస్టు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని అమరావతికి పంపారు.

 

దాంతో సమస్య తీవ్రతను అర్ధం చేసుకున్న జగన్ వెంటనే చెన్నైకి తెలుగుగంగ కాలువల ద్వారా మంచినీటి విడుదలకు ఆదేశించారు. దాంతో ఉన్నతాధికారులు కూడా వెంటనే నాలుగు టిఎంసిల నీటిని చెన్నైకి విడుదల చేశారు. దాంతో మంచినీటి సమస్య చాలా వరకూ తీరింది. అదే సమయంలో రుతుపవనాలు కూడా సానుకూలించటంతో వర్షాలు కూడా కురిశాయి. దాంతో మంచినీటి సమస్య చాలా వరకూ తీరింది. అందుకే తమిళనాడు అసెంబ్లీలో జగన్ ధన్యవాదాలు చెబుతూ ప్రత్యేకంగా తీర్మానం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: