అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం... విశాలంలో కాదు ... ఆధిపత్యం చలాయించడంలో...దాడులు చేయడంలో... ఆక్రమించుకోవడంలో, వ్యాపారం చేసుకోవడంలో ఇలా చెప్పుకుంటూ పొతే అమెరికా చాలా విషయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో వివిధ దేశాలపై దాడులు చేసి, ఆ దాడులను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో అమెరిక  అధ్యక్షులు ప్రయత్నం చేస్తుంటారు.  


ఇప్పటి అమెరికా అధ్యక్షుడు వ్యాపారవేత్తగా రాణించిన సంగతి తెలిసిందే.  ట్రంప్ కు బిజినెస్ చేయడం బాగా తెలిసిన విషయం.  రూపాయిని కూడా వృధా చేయడానికి ఆసక్తి చూపించడు.  ఎన్నికల్లో తెలిచిన తరువాత మొదట అమెరికన్ పౌరులు... ఆ తరువాతే ఇతర దేశాల వ్యక్తులు అని చెప్పిన ట్రంప్, ఆ తరువాత మెల్లిగా తన మాటను మార్చుకున్నారు.  మాట మార్చుకొని అనుమతులు ఇస్తున్నారు.  ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా ఎంతవరకు లాభ పడింది అనే విషయం పక్కన పెడితే, చాలా నష్టపోయింది అన్నది మాత్రం వాస్తవం.  


అమెరికా అధ్యక్షుడికి విశేషాధికారాలు ఉంటాయి.  ఈ అధికారాలను వినియోగించుకొని వివిధ దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. అయితే, ట్రంప్ కూడా ఈ అధికారాలను వినియోగించుకొని మొదట ఇరాన్ పై యుద్ధం చేయాలని అనుకున్నారు.  ఆ తరువాత శాంతి మాత్రం వల్లిస్తుంటారు.  దీని వెనుక అసలు కారణం ఏంటో బయటపడింది.  ట్రంప్ కు యుద్ధం చేస్తామని ప్రకటించే అవకాశం లేకుండా చేసింది అమెరికన్ పార్లమెంట్.  


అవును ఇది నిజం.  ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అవసరమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి తగ్గించాలని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశాన్ని కోల్పోయారు. ఆయనిప్పుడు ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోలేరు. ఈ తీర్మానానికి డెమోక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం గమనార్హం. ఇరాన్ ఆర్మీ లీడర్ సులేమానిని చంపేందుకు ట్రంప్ అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: