తెలుగు ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ను పెద్ద పండుగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. కొత్త అల్లుళ్ళు అందరూ అత్తారింటికి చేరుకొని తెగ సందడి చేస్తూ ఉంటారు... ఇక ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సంక్రాంతి పండుగ ముందు సొంతూళ్లకు చేరుకొని... సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడి మొదలైపోతుంది. హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది గొబ్బెమ్మలు. ఇలా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుగుతూ ఉంటాయి. 

 

 

 ఇక సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. కనుమ సంక్రాంతి భోగి అని మూడు రోజులపాటు సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే సంక్రాంతి పండుగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటారన్న  విషయం తెలిసిందే. కేవలం సంక్రాంతి పండుగ సాంప్రదాయంగా జరుపుకోవడమే కాదు సంక్రాంతి నాడు వస్త్రధారణ కూడా సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఉంటుంది. సంక్రాంతి పండుగ రోజు అందరూ తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయమైన వస్త్రధారణలో సందడి చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయమైన వస్త్రధారణ ఒక డ్రెస్ కోడ్ లాంటిది. కానీ ఇప్పటి జనరేషన్లో అది ఎక్కడా కనిపించదే. 

 

 

 

 ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే... అబ్బాయిలు అందరూ పంచెలు కట్టుకొని ఊర్లో తిరుగుతుంటే అబ్బో... హీరోలాగా ఫీలయ్యేవారు.. ఇక అమ్మాయిలందరూ సరికొత్త ముగ్గులు వేస్తూ రంగులద్ది.. సాంప్రదాయమైన వస్త్రధారణతో కుందనపు బొమ్మలా తయారై మురిసిపోయేవారు. కానీ నేటి తరంలో అవి ఎక్కడా కనిపించవు. చర్మానికి అతుక్కుపోయే జీన్స్ ప్యాంట్,  టీ షర్ట్ లు తప్ప నేటి జనరేషన్ లో నాటితరం పంచలు ఎక్కడా కనిపించవు. కానీ పంచ లో ఉండే సాంప్రదాయమైన లుక్ కు ముందు నేటితరం జీన్స్ లు  ఎన్ని వేసినా తక్కువే. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తప్పకుండా సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలి అది ఒకప్పుడు  డ్రెస్ కోడ్. సంప్రదాయ వస్త్రధారణ లేకపోతే వాళ్లను చూసి అందరు నవ్వుకునే వారు కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా సాంప్రదాయమైన బట్టలు వేసుకుని  బయటకు వెళ్లారు అంటే వాళ్లను చూసి నవ్వుకుంటున్నారు నేటితరం యువత.

మరింత సమాచారం తెలుసుకోండి: