నాన్నారూ నాన్నారూ నాకో డౌట్ ...    నీకు ఎప్పుడూ డౌటులే కదరా ? అసలు నీకు డౌట్ రాకపోతే విచిత్రం అంటూ తన కొడుకు మాలోకం డౌట్ ఏంటో అడిగాడు తండ్రి. అర్జెంట్ గా మేధావి అవ్వాలంటే ఏమి చెయ్యాలి నాన్నారూ అంటూ ప్రశ్నించాడు మాలోకం. ఒరేయ్ నీకు అంత అర్జంటుగా మేధావి అవ్వాలి అని ఎందుకు అనిపించిందిరా అంటూ ప్రశ్నించాడు తండ్రి చండ్ర మారాజు. నన్ను బయట అంతా పప్పు, సుద్ద పప్పు అంటూ పిలుత్తున్నారు నాన్నారూ అంటూ ముద్దు ముద్దుగా నత్తి నత్తిగా గారం చేసాడు మాలోకం. అందుకే నేను అర్జంటుగా ప్రపంచ మేధావి అవ్వాలంటుకున్నా అంటూ గంభీరంగా చెప్పడంతో పోన్లే అని జనల దగ్గర కొట్టేసిన కొంత సొమ్ములు ఖర్చుపెట్టి మరీ ట్యూషన్ పెట్టించాడు చండ్ర మారాజు. 

 

ఇంకేముంది రోజు ట్యూషన్ కి వెళ్లడం మ్యాట్టారు చెప్పింది బట్టి పట్టడం చేస్తున్నాడు. ఓ రోజు చండ్ర మారాజు ప్రజలను, ఆయన అనుచరులను ఉద్దేశించి మాట్లాడేందుకు వెళ్తుండగా మాలోకం నేను వస్తాను అంటూ మారం చెయ్యగా నీకు ఇంకా అంత సీన్ లేదమ్మా నేను చెప్పేదాకా నువ్వు ఆగాలమ్మా అంటూ మాలోకాన్ని బుజ్జగించాడు. అయినా మాలోకం వింటే కదా ! నేను వత్తా అంటూ పొర్లి పొర్లి  గచ్చు పగిలేలా పొర్లాడాడు. దీంతో తీసుకెళ్లకపోతే కొంప ఎక్కడ కూలుతుందో అన్న భయం వేసి చండ్ర మారాజు తనతో తీసుకెళ్లాడు. 

 

ఇక చూస్కోండి జనాలను చూసి మాలోకానికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. మ్యాట్టారు చెప్పిన పాఠాలన్నీ గుర్తొచ్చేసి నేను మాట్లాడుతా అంటూ మారం చేసాడు. అంతకు ముందే గచ్చు పగిలిన విషయం గుర్తొచ్చి భయంతో మాట్లాడే అవకాశం ఇస్తే ... అచ్చ తెలుగు లో అష్ట వంకర్లు తిరుగుతూ మాలోకం మాట్లాడుతుంటే జనల నుంచి ఒకటే ఈలలు , ఒకటే నవ్వులు. ఏంట్రా మా మాలోకం మాట్లాడింది అంత నచ్చేసిందా అంటూ చండ్ర మారాజు ఒక్కసారిగా ఆ ప్రసంగం విని కళ్ళు తిరిగి కిందపడ్డాడు. 

 

పక్కన ఉన్న వారు ముఖం మీద బెరిటేజ్ పాలు కొట్టి లేపగా అప్పుడు మాలోకం మాటలు మళ్ళీ వినబడుతున్నాయి. మన రాజ్యం అన్నిటిలోనూ వెనకబడింది అంటే దానికి మా నాన్నారే కారణం, ఆయనకు మీరు మద్దతు ఇస్తే మిమ్మల్ని మీరే ఉరేసుకున్నట్టే  అంటూ మాలోకం మాట్లాడుతుంటే అప్పుడు చండ్ర మారాజుకి ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ... మాలోకాన్ని చూస్తూ పప్పులాంటి అబ్బాయి... సుద్దపప్పు చిన్నారి అనుకుంటూ పాడుకుంటూ కొంపకెళ్ళిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: