వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ గా ఉన్న సమయంలో... కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి  తనకు సిబిఐ కోర్టుకు హాజరు పై వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కు  మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటూ... వాదనలు రావడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత మినహాయింపు కోసం వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.జగన్  హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తో పాటు పలువురు అధికారులకు  కూడా సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. 

 

 

 

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు  భూముల కేటాయింపు వ్యవహారంలో దాఖలైన అనుబంధ  చార్జిషీట్ ను  సిబిఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులైన శ్యాముల్,  వి రాజగోపాల్,  డిఆర్ఓ సుదర్శన్రెడ్డి తాసిల్దార్ ఎల్లమ్మ కు సమన్లు జారీ చేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసిన నిందితులు అందరూ విచారణ నిమిత్తం  ఈ నెల 17న హాజరు కావాలని ఆదేశించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. ఇకపోతే సమన్లు  అందిన వారి లో ఉన్న వాళ్లలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఉండగా... రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు కూడా ఉన్నారు. ఇద్దరితో పాటు ఆయా అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సి.బి.ఐ అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. 

 

 

 అయితే సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును స్వీకరించ వద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా నిందితుల తరఫు న్యాయవాదులు వాదించిప్పటికి కూడా ఫలితం దక్కలేదు. నిందితుల  తరఫు న్యాయవాది వాదనలు తోసిపుచ్చింది సిబిఐ ప్రత్యేక కోర్టు. మరిన్ని వివరాల ఆధారంగానే అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినట్లు సిబిఐ ప్రత్యేక న్యాయ  స్థానానికి తెలిపింది సిబిఐ. ఇదిలా ఉండగా.. ఈ కేసు కిందటి సిబిఐ రెండేళ్ల కిందటే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది. కాగా  దీని పై ఉన్న స్టే ను హైకోర్టు తాజాగా తొలగించడంతో దానిపై మళ్లీ ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: