అమరావతి వ్యవహారాన్ని ఏ విధంగా అయినా సరే క్యాష్ చేసుకోవాలని టిడిపి ప్రయత్నిస్తోంది అని వైకాపా యొక్క ప్రధాన వాదన.  వారి మనసులో మాటలు ఏమున్నా గాని చంద్రబాబు చేసేటటువంటి ప్రతి దాన్ని బయట పెట్టడంలో  మాత్రం చాలా పాజిటివ్గా ముందుకు వెళుతూ ఉంది వైకాపా .

 

 

 మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న మాటలు ప్రత్యేక హోదా కోసం ఆయన చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేస్తున్నాయని వాపోతోంది వైకాపా .  ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఐదేళ్లపాటు చెబుతూనే వచ్చిన సంగతి గుర్తు చేస్తోంది.  చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన మాటలకి అర్ధాలే వేరులే అనేటువంటి పరిస్తితి ఉంది అని ..  ఆయన గనుక నేను ఏదైనా విషయం మీద  పోరాడుతూనే ఉంటా అని ఎప్పుడైతే ప్రకటిస్తారో అది ఇప్పట్లో ఎప్పటికీ సమస్య జనం భావించాలి అని,  ఆయన మాత్రం అప్పుడప్పుడు ప్రజల్లో కనిపించడం కోసం ప్రజల్లో ఉన్నటువంటి వారి సెంటిమెంట్ ని వాడుకుంటున్నారు అని వైకాపా  విమర్శలు తీవ్రంగా విమరిశీస్తోంది .  

 

 

అధికార వికేంద్రీకరణ ఉద్దేశించి మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే , అయినా చంద్రబాబు తరలింపు వ్యతిరేక పోరాటాలు చేయడం ఎంత వరకూ  అవసరమో కూడా తెలీని పరిస్తితి . చంద్రబాబు కావాలని రెచ్చగొడుతున్నారని కొంతమంది, జనాలని కావాలని సమీకరించి  ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మరికొంతమండీ ఆయన డ్రామాలు  బయట పెడుతూ ఆరోపిస్తున్నారు ..  పవన్ కళ్యాణ్ ని సిపిఐ సిపిఎం ఇలాంటి వారందరినీ కలుపుకుని ఏదో చేద్దాం అనుకుంటే ఫైనల్ గా ప్రత్యేక హోదా మీద ఆయన అప్పట్లో చేసిన డ్రామీ నే ఇది కూడా అంటూ వైకాపా సంచలన ఆరోపణలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: