ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు, ఒక మంచి ఆత్మ బంధువుగా ఉండేటువంటి రోజా విషయంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం . ఆమె తన సొంత నియోజకవర్గంలో సచివాలయం ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు అనే వార్తలు మనం ఎక్కువగా చూశాం.   ఆ తర్వాత రోజు  కూడా చిత్తూరు లో జరిగినటువంటి కార్యక్రమంలో రోజా ని సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టడం మనం అబ్జర్వ్ చేశాం .. అయితే ఈ పరిస్థితుల్లో నగరి నియోజకవర్గంలో ఆర్.కె.రోజా తన పట్టుని కోల్పోతున్నారు అనే అభిప్రాయం రీసెంట్ గా జరుగుతున్న గొడవ వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్లో మొదలయ్యే పరిస్తితి ఉంది.

 

 

 వైకాపా కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరించిన వైనం వార్తల్లో జగన్ కూడా షాకింగ్ గా  అనిపించింది అట .  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్సార్,  కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆమె వివరణ ఇచ్చుకున్నారు అని తెలుస్తోంది. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో రోజా చాలా సీరియస్గానే డిస్కషన్ పెట్టారట.  జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరుకుని మనసులో ఉన్నదంతా చెప్పారట .. ఎప్పటినుంచో జరుగుతున్నది మొత్తం కాస్త రహస్యంగానే జగన్మోహన్రెడ్డికి ఆమె తన ఇబ్బందులు చెప్పుకున్నారు అని  ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.  

 

 

అయితే రోజాపై నియోజకవర్గంలో ఈ  వ్యతిరేకత కొత్తేమీ కాదు అని చాలామంది అంటున్నారు . ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి అనీ  ఎన్నికల సమయంలో అసలు రోజా కి టికెట్ కూడా ఇవ్వకూడదని కొంత మంది వైకాపా నేతలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ముఖ్యనేత , సీనియర్ నేత రోజా కి వ్యతిరేకంగా అప్పట్లోనే పావులు కదిపారు.  ఆమెకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని జగన్ దగ్గర కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.  అయితే జగన్ పై విధేయత అప్పుడు ఆమె గెలిచేలా చేసింది . ఈ విషయాలన్నీ జగన్ మాట్లాడుతూ ఉంటే  తన పరిస్థితిని వివరించే ప్రయత్నం ఆమె చేశారని తెలుస్తోంది . అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడుదాం అంటూ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: