ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతులే  కాకుండా రైతు కుటుంబం మొత్తం రోడ్ల మీదకు చేరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక  రాజధాని అధ్యయనం కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కారు నియమించిన కమిటీ లు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో రాజధాని రైతులు నిరసనలను  మరింత ఉధృతం చేశారు. దీంతో అమరావతి మొత్తం తీవ్ర స్థాయిలో అట్టుడుకుతోంది. అయితే అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనకు విపక్ష  పార్టీలైన టీడీపీ జనసేన పార్టీ ల మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి లో పర్యటించారు రైతుల నిరసనలకు మద్దతు  తెలుపుతున్నారు. ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజధాని రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక... మూడు రాజధానుల  నిర్ణయాన్ని తెరమీదికి తెచ్చారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే నేడు రాజధాని రైతుల ఆందోళన నేపథ్యంలో గుంటూరు జిల్లా ధర్మవరం రైతులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన రైతులు వారి కుటుంబ సభ్యులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు. 

 

 

 ముఖ్యంగా పవన్ ను కలిసేందుకు వచ్చిన కొండవీటి రాజన్న అనే వృద్ధురాలిని చూడగానే ఆమె తన అమ్మమ్మను  జ్ఞాపకాలను వెతుక్కున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ వృద్ధురాలిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని మురిసిపోయారు. రాజమ్మను  చూడగానే చిన్నప్పుడు మా అమ్మమ్మ తో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మా అమ్మమ్మ మేనత్తలను కూడా ఇలాగే పొదివి పట్టుకునే  వాడిని అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలు విన్న కొండవీటి రాజమ్మ  ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మనవడు ప్రవీణ్ గురించి చెబుతూ వాడి  ఆట పాట అంతా పవన్ కళ్యాణ్ లాగే ఉంటుంది అని చెప్పుకొచ్చారు రాజమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: