పై ఫోటో చూశారుగా.. ఒక మహిళ తలకి తీవ్ర గాయం అవడంతో ఆమె తల నుంచి బాగా రక్తస్రావం అవుతుంది. అలాగే పైన రాసినటువంటి రాతలను చదివారా? ఇదేంటి మరీ ఇంత దారుణమా? ప్రజాస్వామ్య దేశంలో.. అందులోనూ రైతు బిడ్డలను ఇంత దారుణంగా పోలీసులు కొడతారా? అని రాసి ఉంది. ఇంకొన్ని పోస్టులలో.. రాష్ట్ర రాజధాని కోసం భూములను ఇచ్చినందుకు రైతుల కుటుంబాలను ఇంత నీచంగా వేధిస్తారా? ఇటువంటి రాతలు నెట్టింట ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు ఇటువంటి పోస్టులను ఫేక్ అని వెంటనే ఆధారాలను చూపించేశారు.


ఆ ఆధారాలు ఏమిటంటే... ఈ పోస్ట్ లో ఉన్న మహిళపై అప్పుడెప్పుడో కాశ్మీర్ కు చెందిన పోలీసులు లాఠీఛార్జి చేశారని తప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఈ పోస్ట్ ను అనేక సందర్భాలలో కొంతమంది వారికి అనుగుణంగా మార్చుకుని వైరల్ చేస్తుంటారు. తాజాగా కొంత మంది ఆన్లైన్ కార్యకర్తలు ఈ పోస్ట్ ను ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి ఇవి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనకారుల ప్రచారానికీ, అలాగే ఈ ఫేక్ పోస్టులను కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన సిఎబి వ్యతిరేక ప్రచారానికి కూడా యూజ్ చేసుకున్నారని చెప్పేశారు. 2018 సంవత్సరంలో జరిగిన నిరసనలకూ ఈ ఫేక్ పోస్టులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ పోస్టులు లో ఉన్నటువంటి సంఘటనలు ఎక్కడ జరిగాయో కానీ ఇది మాత్రం రాష్ట్ర రాజధాని రైతులకు అస్సలు సంబంధించినవి కావు.



అలాగే మరొకటి ఏంటంటే.. ఒక వ్యక్తి ఒక కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కనిపించే ఒక ఫోటో.  అది కూడా ఆ పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే ఈ ఫోటో తమిళనాడులో ఎక్కడో జరిగినటువంటి ఒక ప్రమాదానికి సంబంధించినది. ప్రతి పార్టీ తమకు అనుగుణంగా ప్రజల్లో ఎమోషన్ న్యూ కలిగించడానికిి ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి కానీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు నిజాయితీగానే పోరాడుతున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు మరి ఎందుకీ తప్పుడు ప్రచారాలు చేయడం? రైతుల ఆందోళనలను కించపరచడానికేనా? లేకపోతే పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమాలు అనే వ్యాఖ్యలకు బలం చేకూర్చడానికా? ఏదేమైనా ఫేక్ పోస్టుల ప్రచారం చేయడం చాలా తప్పు అని చాలా మంది భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: