ఒక్కొక్క సారి మనుషులు చేసే పనుల వల్ల కొందరి జీవితాలు ఎలా నవ్వులపాలై, మంచివారు కూడా అనుమానించే లాంటి సందర్భాలను సృష్టిస్తాయి. ఒక వ్యక్తి మీద చెడు భావం కలిగిందంటే దాని చెరిపి వేయడం అంత సులువు కాదు. అదే ఒక ఆడపిల్ల మీద ఆ ముద్ర పడిందంటే ఆమె జీవితానికే ఓ మచ్చలా మిగిలిపోతుంది. ఇకపోతే ఇప్పుడు అరచేతిలో ఉన్న టెక్నాలజీని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని జోరుగా ప్రచారం జరుగుతున్న కొందరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల దాని పర్యావసనం పలు అనుమానాలను కలిగిస్తుంది..

 

 

ఇప్పుడు మనం చూడబోయే ఘటన కూడ అలాంటిదే. అదేమంటే  గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల క్రితం అదే నగరానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఇద్దరు కాబోయే దంపతులే కాబట్టి వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అతను కోరడంతో తన ఫొటోను కాబోయే భర్తకు పంపింది యువతి. కుదురుగా ఉండని ఆ యువకుడు ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడి మొబైల్ ఫోన్‌కు కాల్ గర్ల్స్ కావాలంటే వీళ్లను సంప్రదించాలంటూ  ఓ మెసేజ్ వచ్చింది.

 

 

అందులో కొందరు అందమైన అమ్మాయిల ఫొటోలు వచ్చాయి. వాటిని తెరిచి చూడగా, అందులో తన కాబోయే భార్య ఫొటో ఉండటమే గాక ఆ ఫొటో పైన ‘కాల్ గర్ల్, కాల్ అర్జంట్’ అని రాసి ఉంది. దీంతో అతడు షాక్ తిని, వెంటనే తన కాబోయే భార్యకు ఫోన్ చేసి నిలదీశాడు. పెళ్లికి సమయం దగ్గరపడే టైంలో తన కాబోయే భర్త తనను కాల్ గర్ల్ అనడంతో ఆ యువతికి కూడా మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే తేరుకుని ఆ ఫొటో, వివరాలు తనకు పంపాలని కోరింది.

 

 

అతడు ఆ వివరాలను పంపిన తర్వాత ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ నిజం తెలిసిన ఆమె కాబోయే భర్తకు ఫోన్ చేసి ఇందులో ఉన్న ఫోటోలు నేను నీకు పంపినవే. తప్పు నీదగ్గరే జరిగింది, ఒక్క సారి ఆలోచించుకో అని చెప్పడంతో, అప్పుడు అతనికి గుర్తుకు వచ్చిన విషయం ఏంటంటే వాటిని తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అర్ధం అయ్యింది.. ఆ ఫొటోలను ఎవరో డౌన్ లోడ్ చేసి వాటి మీద ‘కాల్ గర్ల్’ అని రాసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు వారు తెలుసుకున్నారు.

 

 

వెంటనే దీనిపై స్పందించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూశారా ఎవరో చేసిన పనికిమాలిన పనికి ఒక అమ్మాయి జీవితం ఎంత ప్రమాదంలో పడేదో. వారు ఆలోచించారు కాబట్టి బయట పడ్డారు. ఇదే అమాయకులకు జరిగితే ఎంత దారుణంగా పరిస్దితి ఉండేదో ఆలోచించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: