ఇప్పటికే మూడు రాజధానిలో వ్యవహారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జగన్ ఈ అంశం రోజురోజుకు ఇబ్బంది కలిగించే విధంగా తయారవడంతో దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు. తాను అమరావతిని రాజధానిగా ఉంచడంతో పాటు మరో రెండు చోట్ల కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నానని చెబుతున్న ప్రతిపక్షాలు అదేపనిగా ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నాయి. ఈ విషయంలో టీడీపీ రైతులను బాగా రెచ్చగొడుతూ హడావుడి ఎక్కువ చేస్తోంది.  


తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా  అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాడని వార్తలతో అధికార వైసిపి పార్టీ ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీకి నాలుగో రాజధాని కొత్త తెర మీదకు వచ్చింది. అయితే ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది  మరెవరో కాదు, వైసిపి మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు.  ఏపీకి మూడు కాదు నాలుగు రాజధానులు కావాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

 

 రాజమండ్రి సాంస్కృతిక రాజధాని చేయాలని, ఈ మేరకు  వచ్చే క్యాబినెట్ మీటింగ్ లోను, అసెంబ్లీ సమావేశంలోనూ దీనిపై ప్రతిపాదన పెడతామని రంగనాథరాజు చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించటం చాలా కష్టమని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను కావాలని రెచ్చగొడుతున్నారని రంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుతం అమరావతిలో రాజధానిని నిర్మించాలంటే ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.


 ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ ఉన్నందునే తమ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ రంగనాథరాజు చెప్పారు.అయితే ఆయన చేసిన నాలుగు రాజధానుల  ప్రతిపాదన మాత్రం సంచలనం రేపుతోంది. అయితే నాలుగో రాజధాని ప్రతిపాదన కేవలం మంత్రి సొంత అభిప్రాయం అని దీంట్లో పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీకి చెందిన మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: