క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడును తెరవెనుక నుండి నడిపించిన పార్టీయేతర వాళ్ళల్లో వీళ్ళిద్దరే ముఖ్యులు.  వివిధ కారణాల వల్ల వీళ్ళిద్దరి చేతిలో బంధీ అయిపోయిన చంద్రబాబు వీళ్ళు ఆడమన్నట్టల్లా ఆడారు. చివరకు మొన్నటి ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయారో అందరూ చూసిందే.

 

పార్టీ ఘోర ఓటమికి పార్టీలో చాలామంది కొందరు పార్టీ నేతలతో పాటు పై ఇద్దరు మీడియా ప్రముఖులను కూడా కారణాలుగా అమ్మనాబూతులు తిట్టుకున్న విషయం అందరికీ తెలుసు.  సరే అయ్యిందేదో అయిపోయిందని అనుకుంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును వీళ్ళిద్దరే తెరవెనుక నుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి.

 

గడచిన 24 రోజులుగా మూడు రాజధానులపై జగన్మోహన్ రెడ్డి  ప్రకటన తర్వాత  వీళ్ళిద్దరి మీడియాలో మరీ చంద్రబాబుకు మద్దతుగా రెచ్చిపోయి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు చాలామంది  ఫీలవుతున్నారు.  అమరావతి ప్రాంతాన్ని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చేసిన విషయం అందరికీ ఇపుడు బాగా అర్ధమైపోయింది. అదే సమయంలో చంద్రబాబు బినామీలో లేకపోతే టిడిపి ప్రముఖులకో ఎంతేసి భూములున్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా బయటపెట్టింది.

 

దాంతో ఇపుడు చంద్రబాబు చేస్తున్న రచ్చంతా తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంగానే మెజారిటి జనాలు భావిస్తున్నారు. అందుకనే జనాల మద్దతు కరువైంది. అయితే వీళ్ళ మీడియాలో మాత్రం రాష్ట్రం భగ్గుమంటోందని, రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిపోయిందంటూ ప్రతిరోజు పేజీలకు పేజీలు కథనాలు వండి వారుస్తున్నారు.

 

నిజానికి  ఆందోళన మొత్తం  క్షేత్రస్ధాయిలో కాకుండా కేవలం ఎల్లోమీడియాలో  మాత్రమే కనబడుతోంది.  ఇటువంటి సొల్లు కథనాలతోనే జనాలకు  టిడిపిపై వ్యతిరేకత వచ్చేసే అవకాశాలున్నాయి.  ఎందుకంటే అమరావతి మనందరి రాజధాని అనే భావన ముందునుండి అన్నీ జిల్లాల ప్రజల్లో లేదన్నది వాస్తవం. జరుగుతున్నది చూస్తుంటే  ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబును వీళ్ళిద్దరే ముంచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: