రెండు రోజుల క్రితం రాజధాని రైతులను ఉద్దేశించి సినీనటుడు ఎస్విబిసి చైర్మన్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులను ఉద్దేశించి పృథ్వీరాజ్ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యానించడాన్ని పోసాని తప్పుపట్టారు. మన ప్రాంతంలో రాజధాని వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్న ఆశతో రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు అక్కడ నుంచి రాజధాని తర్లిపోతుంది అనే బాధతో ఆందోళన చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా అంటూ పోసాని మండిపడ్డారు. వెంటనే పృద్వి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


 దీనికి పృద్వి స్పందించారు. అమరావతిలో ధర్నాలు చేస్తున్నారు ముమ్మాటికి పెయిడ్ ఆర్టిస్ట్ లేనని, వారిని ఇక్కడకు తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాతోపాటు నటించిన చాలా మంది ఆర్టిస్టులు అందులో ఉన్నారంటూ పృద్వి చెప్పారు. వీళ్లంతా రైతులు, పెద్ద రైతులు ఎలా అవుతారు అంటూ సమాధానం చెప్పారు. నేను గడ్డితిని బతకడం లేదు అన్నం తిని బతుకుతున్నా, అమరావతి రైతుల నుంచి భూములు లాక్కొన్నప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ పోసానిని నిలదీశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ విధి విధానాల ప్రకారమే మాట్లాడానని, నావల్ల పార్టీ నష్టపోతుందని పోసాని మాట్లాడుతున్నారని, నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వైసీపీకి అభిమానిని పృథ్వి క్లారిటీ ఇచ్చారు.


 దమ్ముంటే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఒక వేదిక మీదకు వచ్చి ఈ విషయంపై నాతో వాదించాలి అని సవాల్ చేశారు. తాను వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరిని పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదని, నేను తప్పు పట్టింది అక్కడున్న పెయిడ్ ఆర్టిస్టులను మాత్రమేనని పృథ్వి అన్నారు. తనకంటే ముందుగా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పార్టీలో చాలామంది వ్యాఖ్యానించారని, వారు ఎవరిని తప్పు పట్టకుండా కేవలం నన్ను మాత్రమే తప్పుపట్టడం తగదంటూ పృథ్వి పోసాని కి సూచించారు. అయితే దీనిపై పోసాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయన పృథ్వి కి ఏ సవాల్ విసురుతారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: