ప్రతిసారి మున్సిపల్‌ ఎన్నికల్లో కార్మిక కుటుంబాల నుంచే చైర్మన్‌ గా ఎన్నికవుతున్నారు. రాజకీయ నేపథ్యం అంతగా లేకపోయిన మున్సిపల్‌ ప్రథమ పౌరులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   ఇంత వరకు ఇతర వర్గాల కుటుంబాల నుంచి ఓటర్లు మున్సిపల్‌     పీఠాన్నీ ఎక్కించిన దాఖలాలు లేకపోవడం బెల్లంపల్లి మున్సిపల్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, కార్మికుల భార్యలు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్‌ అవుతున్నారు. కార్మిక కుటుంబాలను ఓటర్లు ఆదరిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు.


ఇప్పటి వరకు బెల్లంపల్లి మున్సిపల్‌ చరిత్రలో ఆరుసార్లు ఎన్నికలు జరుగగా ఏడుగురు అభ్యర్థులు చైర్మన్‌గా వ్యవహరించారు. వీరంతా కార్మిక కుటుంబాల నుంచి ఎన్నిక కావడం విశేషం.   చైర్మెన్‌ అభ్యర్థిపైనే  ప్రస్తుతం పుర ప్రజల దృష్టంతా కేంద్రీ కృతమై ఉంది. ఈదఫా ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్మెన్‌ సీటులో కూ ర్చోబెడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ఓటరు మహాశయులు  గత చరిత్రను పున:రావృతం చేస్తారా  లేదా కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతారా  అనేది తేలాల్సి ఉంది.


కార్మిక కుటుంబాలకు బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌గా  చెందిన వ్యక్తులే ఎన్నికవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆరు సార్లు మున్సిపాలిటీకి ఇప్పటి వరకు  ఎన్నికలు జరిగాయి. ఏడుగురు మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి రాణించారు.ప్రథమంగా 1987లో బెల్లంపల్లి మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్‌ సర్దార్‌గా పనిచేస్తున్న ఇరిగిరాల చంద్రశేఖర్‌ (టీడీపీ) పోటీ చేసి తొలి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. 1992లో రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో ఫిట్టర్‌గా పని చేస్తున్న అమురాజుల రాజేశ్వరరావు (టీడీపీ) మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. ఆ క్రమంలోనే  సింగరేణిలో సంక్షేమాధికారిగా పదోన్నతి రావడంతో రాజేశ్వరరావు  చైర్మన్‌ పదవికి అర్థాంతరంగా రాజీనామా చేశారు. 

 


ఏడోసారిగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్‌ ఈ నెల 22న  జరగనుంది. ఈ దఫా ఎన్నికల్లోనూ అనేక మంది కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంపెనీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భార్యలు, కొడుకులు, కూతుళ్లు పోటీకి సై అంటున్నారు. కొందరు రిటైర్డు కార్మికులు కూడా ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ అంటున్నారు. ఈ క్రమంలో  పుర ప్రజలు మరోమారు సింగరేణి కుటుంబాలను మున్సిపల్‌ చైర్మన్‌గా పీఠం ఎక్కిస్తారో లేదా  వేరే వ్యక్తులను అందలం ఎక్కించి గత చరిత్రను చెరిపేస్తారో వేచి చూడాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: