తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి . తమదే విజయమని అంటూ అన్ని పార్టీలు ధీమాతో  ఉన్నాయి. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఓడిపోయే ప్రసక్తే లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఒక్క చోట ఓటమిపాలైన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ హెచ్చరించారు. దీంతో అలర్ట్ అయిపోయిన మంత్రులందరూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. 

 

 

 

 అయితే ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు  ముగిసింది. ఎంతో మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి భార్య సునీత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ టిఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు పోల రాధాకృష్ణ పేరిట కరపత్రాలు పంచారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సతీమణి సునీత బరిలోకి దిగితే బాగుంటుందని ఆమె అభిమానులు నాయకులు అన్నారు. అయితే విషయం స్థానికంగా ఆసక్తిని కలిగించింది సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే తాజాగా ఈ విషయంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి సతీమణి సునీత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు విడుదల చేశారు. 

 

 

 మున్సిపల్ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని కోరుతూ తన పై అభిమానం చూపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు సునీత . అయితే మీ కోరికను మన్నించలేకపోయినందుకు  క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమె ప్రకటనలో తెలిపారు. తన పిల్లల చదువు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఎస్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలను ఇప్పటికీ కొనసాగిస్తూనే  ఉంటాను అంటూ తెలిపారు జగదీశ్వర్ రెడ్డి సతీమణి సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి: