ప్రతి మనిషి తన జీవితంలో బతికేది తిండి కోసమే, తిండి లేక పోతే మానవుడికి ఉనికి అనేది ఉండదు.  అయితే ఈ తిండి కోసం మనిషి ఎంత దూరం వెళ్తున్నాడు ..  అనేది చివరికి మానవుడి యొక్క ఉనికిని దెబ్బతీసే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.  ముఖ్యంగా పంట కోసం వాడే  క్రిమి సంహారక మందుల వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఐక్యరాజ్యసమితిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని చెబుతోంది.  పురుగుల మందులు,  క్రిమిసంహారక మందులు వాడకం వల్ల మానవుడు తన యొక్క ఉనికి ప్రమాదంలో చేసుకుంటున్నాడు అని హెచ్చరిస్తోంది.  

 

 

అందుకే ముందు జాగ్రత్తగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని  ఐక్యరాజ్యసమితి రీసెంట్ గా ఇచ్చిన నివేదికలో చెప్పింది.  ప్రస్తుతం ప్రపంచ జనాభా 700 కోట్లు ఇందులో 250 కోట్ల మంది చైనా భారత్ లోనే ఉన్నారు 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని అంచనా..  వారి ఆహార అవసరాలు తీర్చడానికి పంటలు వేయాలి వాటికి ఆశించిన చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకం తప్పనిసరి. అది ఇప్పుడు ఏటా 5వేల కోట్ల డాలర్లకు చేరింది. ఒక్క భారత్ లోనే ఏటా 4,050 మెట్రిక్ టన్నుల పురుగు మందుల వాడకం జరుగుతోంది. ఈ మధ్య కాస్త అది తగ్గినా వాడకం ఆపలేదు. మందులు పంటల పరిరక్షణలోను, ఆహారోత్పత్తిని పెంచడంలోను కీలక పాత్ర పోషిస్తాయని పురుగు మందుల కంపెనీలు వాదిస్తున్నాయి.

 

 

వాస్తవంగా అవి కొంత వరకే ప్రభావం కలిగిస్తాయి. ఇష్టం వచ్చినట్టు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల వీటిలోని తీవ్రస్థాయి విషపదార్థాల వల్ల ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారు. అంతే కాదు..దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలకు గురికావడం వల్ల క్యాన్సర్‌, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. నెమ్మదిగా భూమిలో సారం కూడా తగ్గిపోయి ఒక రెండొందల్ సంవత్సరాల తరవాత భూమి మీద ఎక్కడా కూడా పంటలు పండే అవకాశం ఉండదు అని హెచ్చరిస్తున్నారు . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: