తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా  ఎంతో మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి . తమదే విజయమని అంటూ అన్ని పార్టీలు ధీమాతో  ఉన్నాయి. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఓడిపోయే ప్రసక్తే లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఒక్క చోట ఓటమిపాలైన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ హెచ్చరించారు. ఇకపోతే అధికారపార్టీకి రెబల్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంది. దీంతో అలర్ట్ అయిపోయిన మంత్రులందరూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. 

 

 

 అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతో మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఎంతో మంది అభ్యర్థులు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ ఉంటారు. ఒకవేళ పార్టీ నుంచి టికెట్ లభించలేదు అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెబెల్స్ బెడద  అన్ని పార్టీలకు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేసేందుకు రెడీగా ఉంటారు కాబట్టి.అన్ని  పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు పెద్ద తలనొప్పి తెచ్చిపెడతాయి. ఇక పార్టీ నుంచి టికెట్ రాలేదంటే రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగితూ  వుంటారు చాలామంది. దీంతో పార్టీకి వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడి పార్టీ ఎక్కువ స్థానాల్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇక టిఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద మరీ ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మొగ్గు చూపుతుంటారు. దీంతో టికెట్ దక్కని అభ్యర్థులందరూ రెబల్గా పోటీలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

 

 

 అయితే నేడు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. కాగా తాండూరులో ఒక ఇంటి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు కు చెందిన అవిటి  శ్రీశైలం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పట్టణంలోని 26 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా... శ్రీశైలం తల్లి అవిటి వీరమని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక శ్రీశైలం భార్య రాజకుమారి 28 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో శ్రీశైలం భార్య  రాజకుమారిని చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్స్ వేయించారు. ఇక ఒక ఇంటి  నుంచి ముగ్గురు నామినేషన్ వేయడం అది కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: