ప్రస్తుతం అంతా కలల ప్రపంచం నడుస్తోంది. కొంతమంది పగటికలలు కంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తుంటే ఇంకొంతమంది రాత్రివేళలో కలలుకంటూ ఉంటారు. ఏదేమైనా కలలు కనడం  మాత్రం కామన్ గా మారిపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని నిద్ర లోకి వెళ్లారు అంటే ఎంతో మంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇలా కలల జీవితాన్ని గడిపే వారు చాలామంది. కొంత మంది పగటి కలలు కంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కలల ప్రపంచం లోనే బతుకుతూ ఉంటారు. మేము గొప్ప ప్రయోజకులం  కావాలని చిన్నపిల్లలు కలలు కంటుంటే.. ఒక అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే యువకులు కలలుకంటూ ఉంటారు... మంచి జాబ్ కావాలని  కొందరు కలలుకంటూ ఉంటే... మంచి భార్య  రావాలని ఇంకొంతమంది కలలుకంటూ ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళు భిన్నమైన విచిత్రమైన కలలు కంటూనే ఉంటారు. 

 

 

 ఒకసారి నిద్రపోవడానికి బెడ్ మీదికి చేరాము అంటే కలల ప్రపంచంలో బతకాల్సిందే. కొంత మంది పగటి వేళల్లో కూడా కలల  ప్రపంచంలోనే బతికేస్తుంటారు. మన మనసులో ఏదైనా బలంగా అనుకున్నాము అంటే అది రాత్రి కలలో  రావాల్సిందే. అంతే కాదండోయ్  మన నిజ జీవితంలో ఏం సాధించినా సాధించలేకపోయినా కలలో మాత్రం మనమే హీరోలం  మనమే అన్ని  సాధిస్తూ ఉంటాం. ఈ లోకం మొత్తం మన ముందు చిన్నబోతుంది మనం కనే పగటి కలల్లో . కలలు కనండి కలలను సాకారం చేసుకోండి అని మహానుభావులు చెబుతుంటారు. కానీ నేటి తరంలో మాత్రం పగటికలల్లో  బతకడం తప్ప ఆ కలలను సాకారం చేసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. 

 

 

 ఇదంతా పక్కన పెడితే.. ఒక మనిషికి రోజూ ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు పొద్దున్న లేచేసరికి గుర్తుంటే ఇంకొన్ని కలలు మాత్రం నిద్రలో  మాత్రమే గుర్తుంటాయి. అయితే ఒక్క రోజులో ఎన్నో కలలు కంటూ ఉంటాడు మనిషి.. అదే సంవత్సరానికి ఎన్ని కలలు కంటాడో  తెలుసా. ప్రతి మనిషికి సగటున సంవత్సరానికి 1460 కలలుకంటూ ఉంటారు. ఈ విషయం తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతి మనిషి సగటున సంవత్సరానికి 1460 కలలుకంటారు అని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా కలల ప్రపంచంలో ఈ  మాత్రం ఉండాల్సిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: