తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్ల నుంచి భాగ్యనగరానికి వచ్చి  ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారని విషయం తెలిసిందే. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు  వచ్చిన వారందరూ సంక్రాంతి పండుగ సొంతూళ్లకు వెళుతూ ఉంటారు. సొంతూళ్లకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులు బంధువులతో సంక్రాంతి పండుగ ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే సొంతూళ్లకు వెళ్లడం మంచిదే  కానీ సొంతూళ్ల కి వెళ్లేముందు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది అంటూ పోలీసులు సూచిస్తున్నారు. కారణం రోజురోజుకు భాగ్య నగరంలో పెరిగిపోతున్న దొంగతనాలు. 

 

 

 రోజురోజుకు హైదరాబాదులో దొంగతనాలు బెడద ఎక్కువవుతున్న  విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఇళ్లను కూడా దోచేస్తున్నారు దొంగలు. అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో మళ్లీ ఇంట్లోకి తిరిగి వచ్చిన తర్వాత చూసి అవ్వకావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దొంగతనాలు హైదరాబాద్లో రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. అందినకాడికి దోచుకో పోతునే ఉన్నారు. అటు పోలీసులు కూడా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దొంగల బెడద  మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతోంది . ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊర్లకు వెళ్ళేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సీపీ అంజని కుమార్  సూచిస్తున్నారు. 

 

 

 సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుండి  సొంతూళ్లకు వెళ్లేవారి ని హైదరాబాద్ సీపి అంజనీ కుమార్ అప్రమత్తం చేశారు. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో  పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు అంజనీకుమార్. సురక్షితమైన సంతోషమైన హైదరాబాద్ నగరం కోసం ఇలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వాలని సూచించారు ఆయన. పోలీసులకు సమాచారం అందించడం వల్ల ముందు జాగ్రత్తగా వ్యవహరించి ఎలాంటి దొంగతనాలు జరగకుండా చూస్తామని తెలిపారు. పెట్రోలింగ్ పోలీసులు తో స్నేహం అన్ని సందర్భాల్లో చాలా మంచిది అంటూ ట్విట్టర్ వేదికగా అందరిని అప్రమత్తం చేశారు సీపీ అంజని  కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: