రోజురోజుకు మందుబాబులు ఎక్కువైపోతున్న విషయం తెలుసిందే. మద్యం అమ్మకాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి... కారణం రోజురోజుకు మందుబాబులు కూడా భారీగా పెరిగి పోతున్నారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి పోతుంది. మద్యం షాపులు ఏ సమయంలో చూసినా కిటకిటలాడుతున్నాయి. ఇక మందుబాబుల తాగుడు మామూలుగా ఉండదు. పొద్దున్న లేచే సరికి మద్యం షాపు ముందు ఉండడం.. ఫుల్ గా తాగి అక్కడే పడిపోవడం. మందుబాబులు రోజు చేసే పని ఇలాంటిదే. అయితే అధికంగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు పోతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పటికీ  మందు బాబులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉంటారు. హా... ఏమవుతుందిలే ప్రాణాలు ఎందుకు పోతాయి అంటూ ఫుల్ గా  మందేస్తూ  ఉంటారు. 

 

 

 కానీ మద్యం ఎక్కువ తాగడం వల్ల ప్రాణాలు పోవడం ఖాయం అనేది మాత్రం తెలుసుకో లేక పోతారు. ఇక మద్యం తాగే టప్పుడు పక్కన ఉన్న వాళ్ళు బెట్టింగ్ కూడా కాస్త ఉంటారు... గుక్క తిప్పుకోకుండా బీరు మొత్తం తాగితే ఓ కాటన్ బీర్లు కొనిస్తాను అని ... ఈ ఫుల్ బాటిల్ మొత్తం ఒక్క చుక్క లేకుండా తాగితే నీకు ఎంతైనా డబ్బు ఇస్తాను అంటూ మందుబాబులు బెట్టింగ్ కాస్తుంటారు. ఇక ఇలాంటి సమయంలో గుక్క తిప్పుకోకుండా మందు తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే . ఇలా రోజురోజుకు మందు బాబులు మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు.ఎన్నో  అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరిలో మార్పు మాత్రం రావడం లేదు. 

 

 

 తాజాగా మద్యం ఎక్కువ తాగడం వల్ల మరో వ్యక్తి ప్రాణం పోయింది. మద్యం ఎక్కువ తాగడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజాంబాద్ జిల్లా దర్పల్లి కి చెందిన కాశయ్య తన స్నేహితులు దుర్గయ్య సాయిలు అనే ఇద్దరితో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఆఫ్ విస్కీ తాగిన కాశయ్య  తూలినట్లు కనిపించడంతో... స్నేహితులు ఆట పట్టించారు. అయితే తాను ఫుల్ బాటిల్ తాగిన స్టడీ గా ఉంటానని.. తన స్నేహితులతో పందెం కాసాడు కాశయ్య. దీంతో ఫుల్ బాటిల్ తాగిన కాశయ్య స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళితే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: