మొన్నటి అసెంబ్లీ చంద్రబాబు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 175 సీట్లకు కేవలం 23 మాత్రమే తెచ్చుకుంది. ఇక వైసీపీ 151 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు చాలా కుట్రలు పన్నారట. అవేమింటంటే.. సరిగ్గా ఎన్నికలకు ఓ ఏడాది ముందు చంద్రబాబు మోడీతో విబేధించిన సంగతి తెలిసిందే.

 

 

మోడీతో విభేదించి కాంగ్రెస్‌తో కలిసిపోయి ఇక్కడ సంపాదించిన కొంత డబ్బును ఆ జాతీయ పార్టీలకు ఫండ్‌ కింద ఇచ్చాట్ట చంద్రబాబు.. వారి సాయంతో మోడీని పడగొడదామని ప్రయత్నం చేస్తే చంద్రబాబుతో కలిసినందుకు వాళ్లు కూడా ఓడిపోయారట ఈ ఆరోపణలు చేస్తున్నది ఎవరో కాదు.. ఆయన గురించి బాగా తెలిసిన.. కొన్నాళ్లు ఆయన పార్టీలోనే పనిచేసిన వైసీపీ నేత దాడి వీరభద్రరావు.

 

" చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన అప్పులు ఏం చేశారని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో జోలి పట్టి అడుక్కోవడం సిగ్గు చేటు అన్నారు. విశాఖకు వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిదానికి వైయస్‌ జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని దాడి వీరభద్ర రావు ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలు ఏపీని చూసి నవ్వుతున్నాయంటున్నాడు.. ఆంధ్రప్రదేశ్‌ను కాదు చంద్రబాబును చూసి నవ్వుతున్నాయి. చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాలేదని దాడి వీరభద్ర రావు అన్నారు.

 

దాడి ఇంకా ఏమన్నారంటే.. " రాజధాని పేరుతో మన రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నాడు. రాజ్యాంగ పరమైన పదవులను చేసిన వ్యక్తి ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగ, ప్రజాస్వామిక విధానాలు ఉన్నాయి. శాసనసభ కమిటీలకు రిప్రజెంట్‌ చేయొచ్చు.. 150 మంది సమాధానం చెప్పగలను నేను ముసలివాడిని కాదు ఖబడ్దార్‌ అంటున్నాడు. సభలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీకి మెజార్టీ ఉంది కౌన్సిల్‌లో సలహా ఇవ్వండని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: