టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి కోసం పోరాడుతున్నారు. పార్టీని, కార్యకర్తలను అందుకు ఉపయోగిస్తున్నారు. తాను స్వయంగా రాజధాని ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల్లోనూ పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ పర్యటనల్లో ఆయన వీధుల్లో జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సొమ్ముతో అమరావతి రైతుల తరపున పోరాటం కోసం వినియోగిస్తారట.

 

అయితే ఈ జోలె వ్యవహారం అంతా సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఉద్యమాల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. ఇక వైసీపీ నాయకులైతే ఈ జోలె వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు జై అమరావతి అనుకుంటూ మెడలో కండువా వేసుకొని రోడ్ల మీదపడి జోలె పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు.. ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు. ఇంకా డబ్బు సంపాదన కోసం భిక్షాటన చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సిగ్గుచేటు.. అంటూ విమర్శిస్తున్నారు.

 

 

అంతే కాదు.. చంద్రబాబు గతంలో ఇలా అడిగిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా అమరావతి కడతానని ఒక్కో ఇటుకకు రూ. వెయ్యి ఇవ్వమన్నారు. వసూలు చేసిన సొమ్ము లెక్కల్లో చూపించారా..? విరాళాలు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేశామని కరపత్రం అచ్చువేశారా..అధికారంలో ఉన్నా.. లేకున్నా డబ్బు వసూలు మీద పడ్డారు. ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తున్నాడని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

 

రాజధాని మీద ఎన్నికలకు రండి అంటున్నాడు.. రాజధాని మీద ఎన్నికలకు వస్తాం.. నాలుగున్నరేళ్ల తరువాత వస్తాం. వైయస్‌ జగన్‌ నిర్ణయాల మీద ప్రజల తీర్పు కోరుతాం. ఇలాగే ప్రవర్తిస్తే 23 కాదు మీరు గెలవడం కూడా కష్టమే. ప్రజలు ఇచ్చిన తీర్పును ఏం గౌరవిస్తున్నారు. మీ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడవాలని అనే హక్కు ప్రజాస్వామ్యంగా ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు . అదీ లాజిక్కే కదా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: