ఏపీలో అభివృద్ధి కోసం జగన్ బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ తో ఓ అధ్యయనం చేయించారు. ఆ కంపెనీ విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా, కర్నూలను లా కాపిటల్ గా, అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటిల్ గా చేయమని సలహా ఇచ్చింది. అయితే దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు బాగా మండిపడ్డారు. ఎలా కోరితే అలా రిపోర్టు రాసిచ్చేస్తారా అంటూ సదరు కంపెనీపై విమర్శలు గుప్పించారు.

 

అయితే ఆ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అంత ఆషామాషీది కాదంటున్నారు వైసీపీ నేతలు. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూపు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దాన్ని బోగస్‌ గ్రూపు అంటున్నారు. ఐక్యరాజ్యసమితిలో వారు కూడా కొన్ని నిర్ణయాలను తీసుకొని వెస్ట్‌ ఆఫ్రికాలో ఎబోలా అనే వైరస్‌ వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మరణాలు ఎక్కువైపోయేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి బోస్టన్‌ గ్రూపును ఆహ్వానించి స్టడీ చేయించి రిపోర్టు తీసుకుందని చంద్రబాబుకు తెలియదేమో అని బోస్టన్ కంపెనీ గురించి చెబుతున్నారు.

 

 

అంతే కాదు.. నారాయణలో నారా ఉందని కమిటీకి చైర్మన్‌ను చేశారు. ఆయన ఏది చెబితే అది బాబుకు వేదం. మీ రియలెస్టేట్‌ వ్యాపారానికి నారాయణ బ్రోకర్‌. కాబట్టే ఆయన్ను కమిటీ వేసి 32 వేల ఎకరాలను, చుట్టుపక్కల భూమిని ఆక్రమించాలని కమిటీ వేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

 

" జగన్‌ నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. రేపు వచ్చే ఉద్యోగాల భర్తీకి అవకాశం లేకుండా యువత భవిష్యత్తును పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు. రాజధాని విశాఖలో ఉంటే బాగుంటుందని ప్రజలంతా అంటుంటే చంద్రబాబు ఒక్కడే వ్యతిరేకిస్తున్నాడు. కబ్జాలపై ఏం చర్య తీసుకున్నారు. సిట్‌ రిపోర్టును చెత్తబుట్టలో వేశారు. అరాచక శక్తులు వస్తున్నాయంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు అవసరం వస్తే తిరిగబడతాం. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించారా..? అని నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: