ఏపీ సీఎం జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించబోతున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు దాదాపు20 రోజులకు పైగా ఆందోళనలకు దిగుతున్నారు. అయితే ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడంలో విఫలమవుతోంది. 29 గ్రామాలకే ఉద్యమం పరిమితమవుతోంది. ఈ సమయంలో రాజధాని ప్రాంత రైతులకు వైసీపీ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందట.

 

రాజధాని రైతులకు మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాతే విశాఖకు రాజధాని తరలించాలనే యోచనలో ఉన్నారట. అందుకే ఇటీవల మంత్రులు, ఇతర నాయకులు రైతులను ప్రభుత్వంలో చర్చించాలని కోరుతున్నారు. ఏ ఒక్క రైతుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగదని ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజధాని రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.

 

రాజధాని విషయంలో అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన ఒక్కసారి గమనించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని ఆ రోజు వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ సలహా ఇచ్చారు. ఇప్పుడు రాజధానిపై జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ, సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఇక్కడి నుంచి రాజధానిని తీసివెస్తున్నట్లు ఎవరూ కూడా చెప్పలేదు.

 

రాజధాని విషయంలో ఎవరైనా తమన సలహాలు, సూచనలు ఇస్తే కమిటీలు స్వీకరిస్తాయన్నారు. రాజధాని రైతులు ఎవరైనా సరే ఈ విషయంలో ఎదైనా చెప్పాలనుకుంటే సంతోషంగా ముందుకు రావాలని ప్రభుత్వం కూడా ఆహ్వానిస్తుందన్నారు. హైపవర్‌ కమిటీకి విజ్ఞప్తి చేయాలి.. అని సూచించారు నాగిరెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: