జగన్ వీడియోను టీడీపీ మార్ఫింగ్ చేసి వాడుతోందా.. జగన్ అన్న మాటలను ఎడిటింగ్ చేసి.. టీడీపీ అమరావతి విషయంలో దుష్ప్రచారం చేస్తోందా.. అంటే అవునంటున్నారు వైసీపీ నేతలు. ఏపీ సీఎం జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించబోతున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు దాదాపు20 రోజులకు పైగా ఆందోళనలకు దిగుతున్నారు. అయితే ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడంలో విఫలమవుతోంది. 29 గ్రామాలకే ఉద్యమం పరిమితమవుతోంది.

 

అయితే రాజధాని అమరావతి గా ఉండాలని కోరుకునే వాళ్లు.. గతంలో జగన్ అమరావతి రాజధానిగా ఉండేందుకు ఒప్పుకున్నాడని అంటున్నారు. అందుకు ఉదాహరణగా జగన్ ఏపీ అసెంబ్లీలో 30వేల ఎకరాల రాజధాని కావాలని చెప్పిన క్లిప్పింగ్ ను చూపిస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ వంటి వారు దాన్ని వైరల్ చేశారు.

 

అయితే వాస్తవానికి.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని ఆ రోజు వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ సలహా ఇచ్చారు.

 

కానీ ఎల్లో మీడియా కానీ, జగన్ వ్యతిరేకులు కానీ.. ఈ విషయాన్ని ఎడిట్ చేసి.. రాజధాని 30వేల ఎకరాలు ఉండాలని జగన్ అన్నట్టు సృష్టించారు. దాన్నే వైరల్ చేశారు. ఈ విషయంపై ఆలస్యంగా మేలుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన దుష్ప్రచారం జరిగిపోతోంది. ఎందుకనో వైసీపీ, సాక్షి మీడియా ఈ విషయాన్ని బలంగా జనం లోకి తీసుకెళ్ల లేక పోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: