ఈ మధ్య కాలంలో దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలపై జరుగుతున్న అత్యచారాలను అడ్డుకోవడంలో మరియు కేసుల విచారణలో కొందరు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండలో దారుణం చోటు చేసుకుంది. తనపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయటానికి వఛ్చిన యువతిపై సీఐ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
పూర్తి వివరాలలోకి వెళితే కొంతకాలం క్రితం భర్తతో విడిపోయిన ఒక మహిళ వినుకొండలోని ఒక బేకరీలో పని చేస్తూ జీవనం సాగించేది. మహిళ పని చేసి బేకరీకి వచ్చే ఒక యువకుడు మహిళను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించేవాడు. ఆ తరువాత మహిళ ఫోన్ నంబర్ తెలుసుకున్న యువకుడు ఫోన్ చేసే మహిళతో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఒకరోజు రాత్రి సమయంలో యువకుడు ఆమె ఇంట్లోకి చొరబడి బెదిరించి అత్యాచారం చేశాడు. 
 
అత్యాచారం చేసిన సమయంలో మొబైల్ లో ఆ తతంగాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ గర్భం దాల్చటంతో యువకుడు మహిళకు అబార్షన్ చేయించాడు. ఆ తరువాత యువకుడు ఫోన్ నంబర్ మార్చేశాడు. తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మూడు నెలలైనా పోలీసులు పట్టించుకోలేదు. బాధిత మహిళ జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. 
 
జిల్లా ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని వినుకొండ పోలీసులను ఆదేశించగా ఫిర్యాదు చేయటానికి వెళ్లిన మహిళపై సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఫిర్యాదు చేయటానికి వెళ్లిన మహిళను సీఐ "ఏంటి నువ్వు.. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వస్తావ్... చెబితే అర్థం కాదా... నిన్ను వాడే రేప్ చేశాడు అనటానికి సాక్ష్యాలు ఏమిటి..? మీలాంటోళ్లు ఎందుకు మా తలలు తింటారు..? బయటకు పో" అని అన్నారు. బాధితురాలు తనకు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: