పశ్చిమబెంగాల్‌ లో ..

► నేడు కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

►మోదీతో భేటీ కానున్న సీఎం మమతా బెనర్జీ

హైదరాబాద్‌ లో 
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు ముగసిన నామినేషన్ల గడువు

►మొత్తం 21,850 నామినేషన్లు దాఖలు, నేడు పరిశీలన.

►12,13న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం

►14న సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

గుంటూరులో 

► నేటి నుంచి రెండురోజుల పాటు సూర్యలంక బీచ్‌ ఫెస్టివల్‌

►బీచ్‌ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

►తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు తిరుపతికి వెళ్లనున్నారు.

► రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌ తో చంద్రబాబునాయుడు తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించనున్నారు. 

► ఈ ర్యాలీలో జనసేన సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పాల్గొననున్నారు.
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడుజరగనుంది. 

జనసేన అధినేత పవన్ అధ్యక్షత నిర్వహించనున్న ఈ సమావేశంలో రాజధాని అంశంపై చర్చించనున్నారు.

► జాతీయ మహిళా కమిషన్‌ నిజనిర్ధారణ కమిటీ నేడు అమరావతిలో పర్యటించనున్నది. 

► మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జిపై ఈ కమిటీ విచారణ చేపట్టనున్నది. 

► నేడు జాతీయ విద్యాదినోత్సవం.

►సీఎం జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

► కేసును ఈ నెల 17వ తేదీకి కేసును వాయిదా వేశారు. ఆ తర్వాత మరో రెండు మూడు వాయిదాలు అయిన తర్వాత వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో కేసు ట్రయల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: