రాజకీయంలో ఎప్పుడు ఎవరు మనవారు అవుతారో, ఎప్పుడు పరాయి వారు అవుతారో తెలియదు. అంతవరకు భజన చేసిన వారు. వెన్నుపోటు పొడవ వచ్చూ. ద్రోహం చేస్తారనుకున్న వారు ఆప్తులుగా మారవచ్చు. ఇక్కడ ఉన్న వారు అందరు నటులే. అది వారి వారి అవసరాలు ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటారు. సినిమాల్లో రంగు వేసుకున్న పాత్రలు కొంత సమయం వరకే నటిస్తే, రాజకీయాల్లో ఆ రంగు బయట పడకుండా నటిస్తూనే ఉంటారు.

 

 

ఇకపోతే ఉద్యమమే ఊపిరిగా మార్చుకుని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణాలో ఇప్పుడు రాజకీయం పులిలా మారుతుందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తన మనసులో ఏముందో బయటకు చెప్పకుండా వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మరోసారి ఈటల, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారా అనే అనుమానం వచ్చేలా, ఓ రకంగా కేసీఆర్‌కు సూటిగా తగిలేలా మాట్లాడారు.

 

 

అదేమంటే తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ యూనియన్లకు వ్యతరేకంగా, ఆర్టీసీలోనే కాదు.. ఎందులోనూ యూనియన్లు ఉండడానికి వీల్లేదని, ఈ యూనియన్ నాయకుల వల్లే మొత్తం సమస్యలు వస్తున్నాయని స్పష్టం చేశారు. అందుకు ప్రతిగా ఒక్కో డిపో నుంచి 9 మంది సభ్యులు తమ తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు.

 

 

ఓ వైపు సీఎం కేసీఆర్ మాత్రం యూనియన్లు అంటే అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతుంటే... మరోవైపు ఈటల రాజేందర్ మాత్రం యూనియన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపోతే సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్ గేటు వద్ద, సావిత్రి బాయ పూలే జయంతి సందర్భంగా జరుపుకుంటున్న కార్యక్రమానికి ఈటల హాజరయ్యారు.

 

 

ఈ మధ్య కొందరు యూనియన్లు ఎందుకు అంటున్నారు ?. అన్నీ ఉన్నోడికి యూనియన్లు అవసరం లేదు. అణచివేతకు గురవుతున్న మనలాంటి వారికి అవసరమే. అని ఈటల కామెంట్ చేశారు. ఇకపోతే ఈటల మాటలు ముందు ముందు పార్టీలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో వేచి చూడాలని అనుకొంటున్నారు కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: