అగ్రదేశాలు అయినా ఇరాన్ అమెరికా మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలతో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులు పరస్పర హెచ్చరికలు కూడా జారీ చేసుకుంటున్నారు. ఇక ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇరాన్ లోని అమెరికా స్థావరాలపై కూడా క్షిపణి దాడులు చేసింది ఇరాన్ . ఈ దాడులు జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. కుప్పకూలి పోవడం తో ఒక్కసారిగా విమానం పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 176 మంది దుర్మరణం పాలయ్యారు. అగ్ర రాజ్యాలైన అమెరికా ఇరాన్  దేశాల మధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతున్న క్రమంలో.. 176 మంది తో ప్రయాణం చేస్తున్న విమానం కుప్పకూలిపోయి పేలిపోవడం... ఈ ప్రమాదంలో 176 మంది ప్రాణాలు కోల్పోవడం  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. 

 

 

 అయితే అప్పటికే ఇరాన్ అమెరికా మధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతున్న నేపథ్యంలో విమానాన్ని కూల్చినది  ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ విమానాన్ని అమెరికా కూర్చుందా లేక ఇరాన్ కూల్చెసిందా అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తామే  విమానాన్ని కూల్చి వేశామంటూ ఎట్టకేలకు అంగీకరించింది ఇరాన్ . ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారీఫ్   ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేవలం మానవ తప్పిదం గానే ఈ విమాన ప్రమాదాన్ని పరిగణించాలని ఆయన కోరారు. అమెరికా దేశం యొక్క దుందుడుకు చర్య లే ఆ విమాన ప్రమాద ఘటన కు దారి తీశాయని ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరిఫ్  ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.. 

 

 

 విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులందరికీ తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో 176 మందితో బయలుదేరిన బోయింగ్ విమానం కుప్పకూలడంతో... ఈ చర్యకు ఇరానే పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే మొదట్లో ఇరాన్  ఈ ఆరోపణలను ఖండించింది. ఇక ఆ తర్వాత ఇరానే విమానాన్ని కూల్చి వేసినట్టు అమెరికా కెనడా ఇంటిలిజెన్స్ విభాగాలు కూడా ప్రకటనలు చేశాయి. దీనికి తోడు విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన వీడియో కూడా బహిర్గతం కావడంతో సంచలనం రేగింది. ఇక ఇరాన్ పై  రోజురోజుకు ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో చివరకు ఇరాన్ అంగీకరించక  తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: