జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో  పెరిగిపోతున్న ఆందోళనలతో హై పవర్ కమిటిలో టెన్షన్ పెరిగిపోతోందా ?  పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది.  మూడు రాజధానుల ఏర్పాటుపై డిసెంబర్ 17వ తేదీన జగన్ అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు. జగన్ నోటివెంట మాట వచ్చిందంటే అది అయిపోవాల్సిందే. కాకపోతే జీఎన్ రావు కమిటి అని, బిసిజి నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందని  కలరింగ్ ఇచ్చారు.

 

రెండు కమిటిల నివేదిక తర్వాత మళ్ళీ వాటిని అధ్యయనం చేయటానికి మళ్ళీ మంత్రులు, ఉన్నతాధికారులతో హై పవర్ కమిటి వేశారు. ఇపుడా కమిటి సమావేశాలు పెడుతోంది లేండి. నిజానికి రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించాలని జగన్ డిసైడ్ అయిన తర్వాత  కమిటిలు, నివేదికనలన్నవి కేవలం టైం వేస్టు మాత్రమే అని అందరికీ తెలిసిందే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు నివేదికలపై హై పవర్ కమిటి సమావేశాలు పెడుతుంటే రాష్ట్రంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. నిజానికి జగన్ ప్రతిపాదన తర్వాత అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో తప్ప ఇంకెక్కడా ఎలాంటి గొడవ జరగలేదు. మరి అలాగుంటే చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాకు ఎలా మనసొప్పుకుంటుంది ? అందుకనే జనాలను యధాశక్తి రెచ్చగొడుతున్నారు.

 

రాజధాని ప్రాంతంలో మాత్రమే గోల జరిగితే ఉపమోగం లేదని గ్రహించిన చంద్రబాబు, ఎల్లోమీడియా గోలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింప చేస్తున్నారు. ఇందులో భాగంగానే  రాజమండ్రి, తిరుపతికి కూడా చంద్రబాబు వెళ్ళారు. రాజధాని ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన ఉన్నది వాస్తవమే. కానీ జరుగుతున్నదానికన్నా బాగా ఎక్కువ చేసి ఎల్లోమీడియా హైలైట్ చేస్తోంది.

 

సరే ఎవరి ఆలోచనలు ఎలాగున్న రాజకీయపరమైన క్రీడలో  చంద్రబాబు లబ్దిపొందాలని చూస్తున్నారు. ఈ విషయంలోనే  హై పవర్ కమిటి టెన్షన్ పెరిగిపోతోంది. రాజధాని విషయంలో జగన్ వెంటనే ఓ ప్రకటన చేసి యాక్షన్ లోకి దిగకపోతే  అల్లర్లు మరింత పెరిగిపోవటం ఖాయం.  ఈ సాకుతో చివరకు కేంద్రం జోక్యం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: