ఇరాన్ రాజధాని ఇరాన్‌లో పోయిన బుధవారం ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. ఆ విమానంలో ఉన్న 176 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మృతి చెందారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.. అయితే కావాలనే కూల్చించి అని ఆరోపణలు వచ్చాయి. 

 

కరెక్టుగా ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తించింది. అయితే విమానాన్ని కూల్చింది ఎవరు? అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే విమానాన్ని తామే కూల్చేశామంటూ ఇరాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి జవద్ జరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని అయన తెలిపారు. 

 

అంతేకాదు ఈ ఘటనను కేవలం మానవ తప్పిదంగానే పరిగణించాలని అయన కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని అయన చెప్పారు. కాగా మృతుల కుటుంబ సభ్యులకు, తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నామని అయన అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

విమానం కూలిపోయిన సమయంలోనే ఇరానే ఈ చర్యకు పాల్పడిందని ఆరోపణలు భారీగా వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ అప్పట్లో ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు అప్పటికే ప్రకటించాయి. దీనికి తోడు, విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది.. దీంతో ఇరాన్ వారే చేసినట్టు చివరికి ఒప్పుకుంది. మరి ఇప్పుడు ఈ ఘటనతో మళ్ళి ఎం జరుగుతాయి. కాగా ఇరాన్, అమెరికా యుద్ధాల కారణంగా భారత దేశంలో భారీ నష్టాలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: