కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశంలో ఉండటం కన్నా కాందిశీకునిగా వేరే దేశానికి వెళ్ళిపోవటమే మేలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  ఈ దేశపౌరుడిగా ఉండటమే దండగంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. ప్రజలంతా వేరే దేశానికి శరణార్ధులుగా వెళ్ళిపోవాలని జనాలను కోరారు. ఈ దేశం నుండి వెళ్ళిపోవటానికి ప్రజలంతా కలిసి రావాలని కోరటమే విచిత్రంగా ఉంది.

 

ప్రస్తుత పరిస్ధితుల్లో చూస్తు ఊరుకుంటే దేశంలో నేరాలు-ఘోరాలు పెరిగిపోతాయన్నారు. అమరావతి కేంద్రంగా జరిగిపోతున్న ఘోరాలను చూడలేకపోతున్నట్లు పాపం సుజనా తెగ బాధపడిపోయారు. మొత్తానికి సుజనా బాధేమిటో అర్ధమైపోయింది. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మొదటి నుండి సుజనా వ్యతిరేకంగానే ఉన్నారు.

 

జగన్ ప్రతిపాదనపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు బిజెపి అగ్రనేతలు బాగా క్లాసు పీకినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే  జగన్మోహన్ రెడ్గి దెబ్బకు  చంద్రబాబు విలవిల లాడిపోతున్నారు. చంద్రబాబు బాధను చూస్తు ఊరుకోలేక, బిజెపి లైన్ ప్రకారం మౌనంగా ఉండలేక  సుజనా గిలగిల లాడిపోతున్నారు. అందుకనే చాలా రోజుల తర్వాత నోరిప్పారు. జగన్ మీద కోపాన్నంతా  చూపుతూ దేశంలో ఉండటం దండగని, కాందిశీకునిగా ఇతర దేశానికి వెళ్ళిపోతానంటూ హెచ్చరిస్తున్నారు.

 

నిజానికి పదేళ్ళుగా ఎంపిగా కొద్ది కాలం కేంద్రమంత్రిగా ఉన్నపుడు సుజనా వల్ల  రాష్ట్రానికి జరిగిన మేలేమీ లేదు. పైగా బ్యాంకుల నుండి అడ్డుగోలుగా దోచేసుకున్న వేలాది కోట్ల రూపాయలపై సిబిఐ, ఈడి, ఐటి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. టిడిపిలో ఉంటే అరెస్టు చేస్తారన్న భయంతోనే బిజెపిలోకి ఫిరాయించారు.

 

ఆర్ధిక నేరాలపై అనేక కేసులున్న సుజనా కూడా దేశం గురించి మాట్లాడటం, బాధపడిపోవటమే విచిత్రంగా ఉంది. దేశం బాగు గురించి నిజంగానే అంత బాధపడే వ్యక్తే అయితే  అన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నాడు. సిబిఐ అరెస్టు నుండి భయపడి చంద్రబాబుతో చెప్పుకుని రాష్ట్రంలోకి సిబిఐ విచారణే జరగకుండా ఎలా అడ్డుకున్నాడు ?  బహుశా కేంద్ర దర్యాప్తు సంస్ధల అరెస్టుకు రంగం సిద్ధమైందేమో ? అందుకనే సొల్లు మాట్లాడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: