దిశ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ కేసులో పోలీసులు ఎంత ఆసక్తి చూపించారో ప్రజలు కూడా అంతే ఆసక్తి చూపడమే కాకుండా నిందితులను శిక్షించాలని రోడ్డుమీదకు వచ్చి నినాదాలు చేశారు.  అంతేకాదు, ఈ విషయంలో మీడియా అన్నింటికంటే అధికంగా ఫోకస్ చేసింది.  మీడియా చాలా కేర్ తీసుకొని ప్రతి నిమిషం ఈ విషయాల గురించి డిబేట్ చేసింది.  మీడియాలో నిత్యం ఫోకస్ కావడంతో ఈ ఇష్యూ జాతీయ స్థాయి వరకు వెళ్ళింది.  


నిందితులను పట్టుకున్న క్షణం నుంచి కూడా మీడియా నిందితులకు సంబంధించిన ప్రతి విషయాన్ని నిత్యం ప్రసారం చేస్తూనే ఉన్నది.  అక్కడితో ఆగకుండా దిశా కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన తరువాత దీనిపై మరింతగా ఫోకస్ చేసింది.  అంతేకాదు, ఎన్ కౌంటర్ చేయడం రైటా రాంగా అనే దానిపై ఎన్నో డిబేట్ లు నిర్వహించింది. ఇకపోతే, నిందితులు చేసిన తప్పు గురించి చర్చించడమే కాకుండా నిందితులు తప్పు చేశారు అని మీడియా నిర్ధారిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.  


దీంతో మీడియా నిందితులు తప్పు చేశారని ఎలా నిర్ధారిస్తారని చెప్పి సుప్రీం కోర్ట్ న్యాయవాది ఎం ఎల్ శర్మ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు ఇచ్చారు.  అనంతరం దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.  ప్రెస్ కు కొన్ని సూచనలు చేసింది.  జరిగిన ఘటన గురించి చర్చించే స్వేచ్ఛ ఉందని, కానీ, నిందితులను తప్పు చేశారని నిర్ధారించే రైట్స్ మీడియాకు లేవని తెలిపింది.  


హైదరాబాద్ లో దిశ హత్యోదంతం అనంతరం నిందితులైన నలుగురు యువకులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జి.ఎస్.మణి, ఎం.ఎల్.శర్మ, ముకేష్ కుమార్ శర్మలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: