సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు... చాలామంది పీడ దినం గా భావిస్తూ ఉంటారు. గ్రహణం ఉన్న రోజు మొత్తం ఒక పీడ దినం గా భావిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే పురాతన కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతూనే ఉంది. ఇకపోతే  నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం జరిగిన విషయం తెలిసిందే. ఇక గ్రహణం అంటేనే అదో పీడ దినం గా భావిస్తూ ఉండే  జనాలు గ్రహణం రోజున ఎక్కడికి వెళ్లడం కానీ... ఎలాంటి కొత్త పనులు కానీ చేయరు. ఇక గ్రహణం రోజున ఏ  ఘటన జరిగిన గ్రహణం కారణంగానే జరిగిందని చెబుతూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే... ఉత్తరప్రదేశ్ కనౌజ్  జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇక ఈ రెండు ఒక్కసారిగా బలంగా ఢీకొనడంతో బస్సులో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సులో వ్యాపించిన మంటలు ట్రక్కుకు  కూడా అంటుకున్నాయి. 

 

 


 అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రైవేటు బస్సులో చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రమాదం జరగడంతో అప్పటికే తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులు... మంటలు వ్యాపించి ఉన్నప్పటికీ ఎటు తప్పించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో బస్సులో భారీగా మంటలు వ్యాపించగా.. ఈ బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు.. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా  ఈ ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రైవేటు బస్సు ఫరుక్కాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో రాజస్థాన్లోని జైపూర్ కు  వెళుతుంది. 

 


 కనౌజ్  జిల్లా చిలోయి  గ్రామం దగ్గర అతి వేగం కారణంగా ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది ఈ ప్రైవేటు బస్సు. అయితే ఈ ప్రమాదానికి పొగమంచే కారణమని తెలుస్తోంది. రహదారిపై పొగమంచు ఎక్కువగా కమ్ముకొని ఉండటం వల్ల.. బస్సు డ్రైవర్ ముందు నుంచి ట్రక్కు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ట్రక్కుకి  ఫ్రంట్ హెడ్ లైట్లు వెలిగే ఉంటాయి కాబట్టి.. డ్రైవర్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా అతి వేగంగా డ్రైవింగ్ చేయడం వల్లే ముందు నుండి వస్తున్న ట్రక్ ను  చూడలేక బలంగా ఢీ కొట్టి ఉంటారని అందుకే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇక ఇంకొంతమంది చంద్రగ్రహణం పీడ దినం కాబట్టి ఇలాంటివి జరిగాయి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: