ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి అమరావతి వ్యాప్తంగా రైతులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపడుతున్నారు. రోజురోజుకు రైతులు రైతు కుటుంబీకులు చేపడుతున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. ఇక రైతుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుండడంతో పోలీసులు లాఠీ ఛార్జీలు సైతం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీలు చేయడంపై విపక్ష పార్టీలు అని విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతిలో రైతులందరూ చేపడుతున్న నిరసనలకు మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ నిలుస్తోంది. అంతేకాకుండా అమరావతి పరిరక్షణ సమితి పేరిట విరాళాలు  సైతం సేకరిస్తోంది. 

 

 

 ఇక రాజధాని అధ్యయనం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన రెండు కమిటీలు కూడా జగన్ 3 రాజధానిల నిర్ణయానికి సమర్థిస్తూ నివేదికలు అందించడంతో అమరావతి రైతులందరూ మరింత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చామని ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని అనేక విధాలుగా అడ్డుకుంటున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీ ఛార్జీలు కూడా చేస్తున్నారు. 

 


 అయినప్పటికీ రైతన్న పోలీసులకు అన్నం పెడుతూనే ఉన్నారు. తనపై లాఠీచార్జీలు చేసిన పోలీసులకు ఓ రైతు అన్నం పెట్టిన వీడియో ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆర్డర్ వేస్తే లాఠీలతో కొట్టిన పోలీస్ సోదరులకు అన్నం పెట్టి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు ఓ రైతు. జై అమరావతి.. నా రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఖాతాలు ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్టు వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో అందరినీ కలిసి వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: