సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి వ్యాప్తంగా రైతులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపడుతున్నారు. రోజురోజుకు రైతులు రైతు కుటుంబీకులు చేపడుతున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. ఇక రైతుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుండడంతో పోలీసులు లాఠీ ఛార్జీలు సైతం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీలు చేయడంపై విపక్ష పార్టీలు అని విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతిలో రైతులందరూ చేపడుతున్న నిరసనలకు మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ నిలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతల అందరూ అధికార వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక మూడు రాజధానిల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తెరమీదకు తెచ్చారని విమర్శిస్తున్నారు. ఇక అమరావతి మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని తప్పుబడుతూ సినీనటి టీడీపీ  నాయకురాలు దివ్యవాణి జగన్ సర్కార్ పై మండిపడ్డారు. పశువుల కన్నా హీనంగా నిరసన తెలుపుతున్న మహిళలను లాగి పారేశాను అని ఆమె ఆరోపించారు. ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు భక్షకభటులు అయితే సామాన్యుడికి రక్షణ ఇంకెక్కడ అంటూ ప్రశ్నించారు.

 


 రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా గాని గన్ కంటే ముందు జగనన్న వస్తాడని రాష్ట్ర హోంమంత్రి సుచరిత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారని... అమరావతి లో మహిళలందరూ కంటతడి పెడుతుంటే ఇవి ఏమీ జగనన్నకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతి లోనే ఉండాలి అంటూ నిరసన తెలుపుతున్న రైతులందరిని  పెయిడ్ ఆర్టిస్టులని  వైసీపీ నేతలు ఆరోపిస్తూ అన్నం పెట్టే రైతన్నను కించపరుస్తున్నారు  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకురాలు దివ్యవాణి. విశాఖలో ర్యాలీ నిర్వహించడానికి మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన విశాఖ కోసం ర్యాలీ  చేస్తే తాము అమరావతి కోసం ర్యాలీ చేస్తున్నామని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: