సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు మామూలుగా ఉండవు . ఇక ఉద్యోగం నిమిత్తం వ్యాపారం నిమిత్తం నగరాలకు వచ్చిన వాళ్ళందరూ పల్లెటూర్లకు చేరుకొని సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగలలో ఒకటి. ఇంటి  ముందు గొబ్బెమ్మలు... హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు.. వాకిటి నిండా రంగవల్లులు... ఇలా సంక్రాంతి సంబరాలు మొత్తం చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి పండుగ అసలు సిసలైన తెలుగు సంప్రదాయానికి పెట్టింది పేరుగా తెలుగు ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రజలు ఇంటికీ చేరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుండి సొంతూళ్లకు చేరుకోవడం మంచిదే కానీ... సొంతూళ్లకు వెళ్లేముందు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటిస్తే మేలు అని సూచిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే రోజురోజుకు హైదరాబాద్లో దొంగతనాల బెడద ఎక్కువ అవుతున్న  విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేక పోతే చాలు ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకో పోతున్నారు దోపిడి దొంగలు. కేవలం గంట రెండు గంటలు ఇంటి నుంచి బయటకు వెళ్తే అందినకాడికి దోచుకో పోతుంటే ఇక ఏకంగా కొన్ని రోజులపాటు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి ఇళ్లకు రక్షణ ఎక్కడుంది. అయితే సొంతూళ్లకు ఇళ్లకు వెళ్తున్నారా  హ్యాపీ జర్నీ అంటూ దొంగలు చెబుతున్నారు. 

 

 

 మీరు హాయిగా సంక్రాంతి పండక్కి వెళ్లి ఎంజాయ్ చేయండి మా పని మేము కానిస్తాం అనుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో సంక్రాంతికి ఊరెళ్లాలి అన్న భయపడుతున్నారు జనాలు. అయితే సంక్రాంతికి ఊరు వెళ్ళే ముందు పోలీసులకు సమాచారం అందించాలని ఇప్పటికే సీపీ అంజని కుమార్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. దొంగల బెడద ఎక్కువగా ఉన్న తరుణంలో... తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఇకపోతే అటు  దొంగలు మాత్రం... అందరూ ఉన్నప్పుడే దొంగతనాలు చేసేవాళ్ళం.. ఇప్పుడు  ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేయడం పెద్ద లెక్క అంటూ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారందరికీ హ్యాపీ జర్నీ చెబుతూ దొంగతనాలకు సిద్ధమై పోతున్నట్లు సమాచారం. అందుకే సంక్రాంతికి ఊరు వెళ్తున్నవారు బి కేర్ఫుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: