జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు రాపాక వరప్రసాద్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు జనసేన పార్టీ సమావేశానికి కూడా రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. ఈ సమావేశానికి ఏపీలోని 13 జిల్లాల నుండి జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. 
 
కానీ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. గతంలో శాసనసభ సమావేశాల కారణంగా పవన్ చేపట్టిన దీక్షకు హాజరు కాలేదని చెప్పిన రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఏం చెబుతారో చూడాల్సి ఉంది. గతంలో ఆంగ్ల మాధ్యమం విషయంలో రాపాక పవన్ కళ్యాణ్ తో విభేదించారు. దిశ కేసు నిందితుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా రాపాక గతంలో ఖండించారు. 
 
ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్థిస్తానని చెప్పిన రాపాక వరప్రసాద్ జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. ఆరోగ్యశ్రీ పథకంపై కూడా ప్రశంసల వర్షం కురిపించిన రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ సమావేశానికి హాజరు కాకుండా అదే సమయంలో మంత్రి కొడాలి నానితో పాటు ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ సభలకు హాజరు కాకుండా రాపాక వరప్రసాద్ కొడాలి వెంట ఉండటం చర్చనీయాంశమైంది. 
 
కొడాలి నానితో పాటు ఉండి రాపాక వరప్రసాద్ ఎడ్ల పందేలను తిలకించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా సమావేశాలకు డుమ్మా కొట్టి పార్టీ నేతలను ఆశ్చర్యపరచిన రాపాకవరప్రసాద్ తాజాగా మరోసారి సమావేశాలకు డుమ్మా కొట్టి నేతలను ఆశ్చర్యపరిచారు. రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి జనసేన పార్టీకి తలనొప్పిగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తీరును కూడా తప్పుబట్టిన రాపాక భవిష్యత్తులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీకి ఇంకా ఎన్ని షాకులు ఇస్తాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: