శకునం చెప్పిన బల్లి కుడితిలో పడ్డట్టుగా తయారయ్యింది ఏపీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి. కొద్దిరోజులుగా అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ డిమాండ్ చేస్తూ రైతులు ప్రజలను కొంత మందిని రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.  ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల్లో కూడా అమరావతిలోని ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు తిరుపతిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ర్యాలీలో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్ నుండి విమానంలో చంద్రబాబు బయలుదేరే రేణిగుంట చేరుకున్నారు. 


మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించి ఆ తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని, సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొనాలని ముందుగా ప్రణాళిక రచించారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా చంద్రబాబు తిరుపతి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రబాబు బయటకు వస్తే ఆయనను ముందస్తుగా అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. 


గతంలో వైసిపి అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకోవడం, దానికి నిరసనగా ఆయన నేల మీద కూర్చుని నిరసన తెలపడం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 26న విశాఖ బీచ్ రోడ్ లో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ విశాఖకు వచ్చారు. అయితే  శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ను ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లోకి రాకుండా పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. 

 

ఈ సందర్భంగా జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత జగన్  వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే సీన్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుకు ఎదురవడంతో గత సంగతులను చాలామంది గుర్తుచేసుకుంటున్నారు . చేసిన పాపం ఊరికే పోదు కదా అంటూ చంద్రబాబుకు మరికొందరు శాపనార్ధాలు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: