నిన్ననే బిజెపి నాయకులను అమరావతి విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బిజెపి సరైన విధంగా స్పందించకపోవడం వల్లే అమరావతిలో ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోందని, బిజెపి రెండు నాల్కల ధోరణితో ఇక్కడో మాట అక్కడో మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని పవన్ విమర్శించారు. తాజాగా ఈ రోజు జనసేన విస్తృతస్థాయి సమావేశం పవన్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీతో అమరావతి ఉద్యమంలో కలిసి ముందుకు వెళ్లే విషయమై పవన్ చర్చించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కొంతమంది నాయకులు  పవన్ కు సూచించారు.


 అనంతరం సమావేశంలో పవన్ ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా సమావేశం మధ్య నుంచి పవన్ ఢిల్లీకి వెళ్లి పోయారు. అయితే ఇంత హడావుడిగా పవన్ ఢిల్లీకి వెళ్లడం వెనుక కారణాలేంటి అనే విషయం ఆరా తీయగా బీజేపీలో జనసేన ను విలీనం చేయాలని గతంలో బిజెపి ప్రతిపాదించిన విషయంపై మరోసారి క్లారిటీ తీసుకునేందుకు పవన్ ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తోంది. గతంలోని జనసేన ను బిజెపిలో విలీనం చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాను విలీనం చేయమని చెబుతూనే బీజేపీ అగ్ర నాయకులను పవన్ పొగిడారు. తనకు బీజేపీ, ఆ పార్టీ నాయకులూ మోదీ, అమిత్ షా అంటే చాలా ఇష్టం అంటూ చెప్పారు. 


ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్ కారణాలు ఆరాతీస్తే జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఆయనకు సీఎం అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని బీజేపీ అధిష్టానం ఆఫర్ ప్రకటించిందనే ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. అయితే దీనిపై జనసేన పార్టీ నాయకులు మాత్రం అమరావతి విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు పవన్ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లారని, ఇందులో మరో ఉద్దేశం లేదు అంటూ వాదిస్తుండగా అదే నిజయమయితే ఇంత అకస్మాత్తుగా సమావేశం మధ్యలో నుంచి లేచి మరీ ఢిల్లీకి వెళ్లడం అనుమానాలు కలిగిస్తోందంటూ మరికొందరు వాదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: