రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై విల్సన్ ను చంపిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కేరళ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరగగా పోలీసులు నిందితులు కేరళకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తమిళనాడు, కేరళ రాష్ట్ర పోలీసులు నిందితుల కొరకు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. 
 
ఢిల్లీలో ఇద్దరిని క్యూ బ్యాంక్ పోలీసులు అరెస్ట్ చేయగా పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని కేరళలో అరెస్ట్ చేశారు. ఎస్సై విల్సన్ విధుల్లో ఉన్న సమయంలో కన్యాకుమారి జిల్లా కిళియక్కావిళై మార్కెట్ రోడ్డులో తుపాకీతో ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఎస్సై విల్సన్ మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తరువాత డీజీపీ ఐదు ప్రత్యేక బృందాలతో కేసు విచారణ చేపట్టారు. 
 
పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులో ఎస్సై విల్సన్ ను హత్య చేసే ముందు ఆగంతకులు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. పోలీసులు ఇప్పటికే ఆగంతకులు ఉపయోగించిన తూటాలను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఎస్సైని హత్య చేయటంతో ఈ ఘటన తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి అబ్దుల్ సమీం, తవుబిక్‌లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. 
 
ఇద్దరు నిందితుల ఆచూకీ తెలిపిన వారికి కేరళ పోలీస్ శాఖ ఐదు లక్షలు ఇస్తానని ప్రకటించగా తమిళనాడు పోలీస్ శాఖ 2 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. పోలీసులు ఇద్దరు నిందితులు ఉగ్రవాదులు అని గుర్తించారు. పోలీసులు బెంగళూరులో ఉగ్రవాదుల దగ్గర స్వాధీనం చేసుకున్న తూటాలు, ఎస్సై విల్సన్ హత్య కోసం వాడిన తూటాలు ఒకే విధంగా ఉన్నట్టు గుర్తించారు. తమిళనాడు సీఎం పళణిస్వామి ఎస్సై విల్సన్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: