పక్క వాళ్ళ ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఆర్మీ జవానులు మాత్రమే. దేశ ప్రజలందరూ సంతోషంగా గుండె మీద చేయి వేసుకుని హాయిగా  పడుకుంటున్నారు అంటే  కేవలం దానికి కారణం దేశ సరిహద్దుల్లో  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడుతున్న ఆర్మీ జవానులు. ఆర్మీ లో పోరాటం చేస్తే తమ ప్రాణాలు పోతాయని తెలుసు... తమ ప్రాణాలు పోతే కుటుంబం ఒంటరి  అయిపోతుందని తెలుసు... కానీ తమ  ప్రాణం కంటే తమ కుటుంబం కంటే దేశ రక్షణ లక్ష్యంగా భారత దేశ సరిహద్దుల్లో  ఆర్మీ జవాన్లు ప్రాణాలర్పించి మరి దేశానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. అసలు జవానులే లేకపోతే ఈరోజు మనం ఇంత సంతోషంగా... ఎలాంటి ప్రాణ భయం లేకుండా ఉండేవాళ్లమా... భరతమాత మీద అసలు సిసలైన ప్రేమ ఉన్నది జవానులకు మాత్రమే. 

 


 జీవరాశి బతకం కష్టం అనుకున్న  చోట కూడా జవానులు ఓ వైపు  బతుకు తో పోరాటం చేస్తూ... మరో వైపు శత్రువులతో పోరాటం చేస్తూ... దేశానికి రక్షణ కల్పిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కంఠంలో ప్రాణమున్నంత వరకు... దేహంలో ఊపిరి  ఉన్నంత వరకు ప్రతిక్షణం దేశం కోసం పరితపిస్తున్న జవానుల కారణంగానే దేశ ప్రజలందరూ ప్రాణ భయం లేకుండా నిశ్చింతగా జీవించగలుగుతారు. శత్రువులతో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ఎంతోమంది. కాగా జనవరి 15వ తేదీన సైనిక దినోత్సవం  జరుపుకుంటుంది భారతదేశం. పెరల్ మార్షల్ కోడెన్ దొర ఎం,  కరియప్ప ఒకప్పటి  ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్... భారత సైన్యం యొక్క మొదటి కమాండర్ ఇన్ చీఫ్ గా  జనవరి 15, 1949 ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన భారతదేశం  సైనిక దినోత్సవం జరుగుతుంది. 

 

 భారత సైనిక దినోత్సవం ఇండియా గేట్ వద్ద, అమర్ జవాన్ జ్యోతి మరియు అన్ని సైనిక కార్యాలయాల వద్ద... ప్రధాన కార్యాలయంలో భారత సైనిక దినోత్సవం  నిర్వహించుకుంటారు. భారత సైన్యం మొత్తానికి సైనిక దినోత్సవం ఒక ముఖ్య దినం . ఎంతోమంది దేశాన్ని కాపాడేందుకు సైనికులతో పోరాడి.. జీవితాలను త్యాగం చేసిన వీరులైన  సైనికులను భారత దేశపు సైనికదినోత్సవం నాడు అభినందిస్తాడు . అంతేకాకుండా శత్రువులతో అలుపెరగని పోరాటం చేసి  వీరమరణం పొందిన సైనికులు అందరికీ ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఎంతోమంది అమరులైన జవానుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతదేశ సైనిక దినోత్సవం జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: