రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలే చెయ్యాలి .. ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తే చేతులు కాళ్ళు కాలడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు అని గడిచిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ద్వారా అందరికీ అర్ధం అయ్యింది అనే చెప్పచ్చు. టీడీపీ పార్టీ కి బీ టీం అంటూ వైకాపా ఎన్ని తీవ్ర విమర్శలు చేసినా వాటిని తిప్పి కొట్టడం లో సక్సెస్ అవ్వలేకపోయారు సరికదా ఆ అపవాదు వచ్చిన తరవాత కూడా అనేకసార్లు అలాగే ప్రవర్తించారు .  తాజాగా మరోమారు ఆయన రియాక్టయ్యారు

 

 

. బీజేపీ - టీడీపీతో విడిపోయాం కనుకే వైసీపీ బలపడిందని పవన్ పేర్కొన్నారు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన ముఖ్య సమావేశంలో పవన్ ఈ మాటలు చెప్పుకొచ్చారు. మంగళగిరి లో రీసెంట్ గా ఆ పార్టీ కార్యాలయం లో స్థానిక ఎన్నికల గురించి విసృత స్థాయి సమావేశం జరిగింది . అక్కడ ప్రజలని ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రజలకు మంచి పాలన అందాలనే ఉద్దేశంతో 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు.

 

 

బీజేపీ - జనసేన - టీడీపీ విడిపోయిన తరవాతనే వైకాపా బలపడింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అనుభవం ఉన్నవారితోపాటు యువతరానికి పెద్ద పీట వేస్తామని పవన్ హామీ ఇచ్చారు.  అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో జగన్ ని ఎదురుకోవడం కోసం మళ్ళీ అదే స్ట్రాటజీ తో వెళితే గానీ జగన్ ని ఓడించలేము అని పవన్ అంటున్నారా ? పవన్ కల్యాణ్ ఉద్దేశ్యం అదే అయితే ఈ సారి కూడా పొత్తు ఉండే అవకాశం ఉండచ్చు. అదే జరిగితే పవన్ తన రాజకీయ గోతి ఆయనే తవ్వుకుంటున్నట్టు లెక్క అని కొందరు పెదవి విరుస్తున్నారు . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: