సమాజంలో ప్రస్తుతం మానవత్వం ఉన్న వారు ఒక్కరు కూడ కనిపించడం లేదు. మనుషులు స్వార్ధ పూరితమైన ఆలోచనలతో బ్రతకడానికి అలవాటు పడుతున్నారు. కాసింత జాలి, దయ లేకుండా, కరుణ అనేది కానరాకుండా బ్రతుకుతున్నాడు.

 

 

ఇకపోతే అమ్మతనంలోని  గొప్పదనం గురించి ఎంత చెప్పిన తక్కువే. మాతృత్వం కోసం ఎంతగానో పరితపించే వారున్నారు. ఇలాంటి గొప్ప అనుభుతిని కాదనుకున్న కర్కోటకురాలు ఎవరో తెలియదు గాని. బిడ్దను కన్న రెండు రోజులకే రోడ్దుపాలు చేసిన ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఆ వివరాలు చుస్తే.

 

 

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్, అపురూప కాలనీలో రెండు రోజుల కింద పుట్టిన పసి కందును ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్ళారు ఎవరో గుర్తుతెలియని వారు. కళ్లుకూడ తెరవని ఆ పసిబిడ్డ ఏం పాపం చేసిందని వదిలి వెళ్లారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

 

 

ఇకపోతే శనివారం తెల్లవారు జామున అటుగా వెళ్లుతున్న ఓయువకుడు ఆ పసికందును గమనించి 100 కాల్ చేసి జీడిమెట్ల పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. ఏఎసై పాండు నాయక్, కానిస్టేబుల్ లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకుని, అక్కడున్న పసికందును బాలనగర్ స్మైల్ టీం ఎస్సైయాదగిరి, సలీం బృందానికి అప్పగించారు.

 

 

ఇకపోతే పాప కండీషన్ బాగా లేకపోవడంతో వెంటనే నీలోఫర్ హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయించి, తర్వాత పసికందును శిశువిహార్ ఇంచార్జ్ కి అప్పగించారు. ఇకపోతే ఇలాంటి ఘటనే ఇదివరకు 3 నెలల క్రితం హెచ్ ఎం టీ కి దగ్గరున్న పొదల్లో జరిగింది.

 

 

ఈ సంఘటన మరవక ముందే ఇలా జరగటం దారుణమన్నారు కాలనీ వాసులు.. లోకంలో మనుషులు రోజు రోజుకు ఎంతకు దిగజారుతున్నారంటే ఇలాంటి సంఘటనలే వాటికి సాక్ష్యాలుగా చెప్పవచ్చు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: