ప్రపంచం మొత్తం ఆన్లైన్లోనే ముందుకు సాగుతుంది. ఏది కావాలన్నా ఆన్లైన్లో వెతుక్కోవడం కొనుక్కోవడం. ఏం  మాట్లాడుకోవాలి అన్న ప్రస్తుతం ఆన్లైన్ ఏ దిక్కు అయిపోయింది. ఒకరోజు సోషల్ మీడియా ఆగిపోతే  ప్రపంచం ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ మెసేజ్ యాప్ లూ  ఎన్నో ఉన్నాయన్న  విషయం తెలిసిందే. అయితే ఆన్లైన్లో మెసేజ్ యాప్ లలో ఎన్ని ఉన్నప్పటికీ వినియోగదారులు అందరూ ఎక్కువగా మొగ్గు చూపేది మాత్రం వాట్సాప్ పైనే. ప్రస్తుతం రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగి పోతుంది. డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కంటే వాట్సాప్లో మాట్లాడుకోవడం.. డైరెక్టర్ కలవడం కంటే వీడియో కాల్ లో చూసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటితరం యువత. 

 

 

 అంతేకాకుండా పక్కన ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో  వాట్సాప్ లో చాటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక మరోవైపు వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను  ప్రవేశపెడుతూ ఎంతోమంది వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఎక్కువగా నెటిజన్లు వాడుతున్న ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్స్అప్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అన్నది ఎంత నిజమో ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంది అన్నది కూడా అంతే నిజం. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లో ఆన్లైన్ మెసేజ్ యాప్  వాట్సాప్ ని వాడుతూ వాట్సాప్ ద్వారానే ఎక్కువ సందేశాలు పంపుతున్నారు. కొంతమంది వాట్సాప్ చాటింగ్ లో ని కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ ద్వారా ఎంతోమంది చిక్కుల్లో కూడా పడ్డారు. 

 

 

 అయితే వాట్సాప్ ని ఎంత యూస్ చేసినప్పటికీ కూడా వాట్సాప్ లో చేయకూడనివీ  కొన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం రండి. మార్ఫ్ చేసిన  ఫోటోలు వీడియోలు షేర్ చేయడం వాట్సాప్ లో నేరం. మహిళలను  ఇబ్బంది పెట్టేలా మెసేజ్లు చేయడం కూడా వాట్సాప్ ద్వారా చేయకూడదు. మరొకరి పేరు తో వాట్సప్ ఖాతాను ఓపెన్ చేయకూడదు.  మతానికి ప్రాంతానికి వ్యతిరేకంగా మెసేజ్ పెట్టడం లాంటివి వాట్సాప్ లో చేయకూడదు. వాట్సాప్ లో వచ్చిన కొన్ని వార్తలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నకిలీ  వార్తలను షేర్ చేయడం లాంటివి చేయకూడదు.  నిషేధిత వస్తువులను వాట్సాప్ ద్వారా అమ్మకాలు జరపకూడదు.  అసభ్యకరమైన క్లిప్ లను  సందేశాలను వాట్సాప్ ద్వారా పంపకూడదు. ఇలాంటివి చేయడం ద్వారా వాట్సాప్ వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంతే కాకుండా పలు మార్లు కేసులు కూడా నమోదయ్యే  అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: